పంజాబ్ (Punjab)లో గత కొన్నిరోజులుగా కొనసాగిన రాజకీయాలకు ఎట్టకేలకు ఆదివారం తెరపడింది. కొత్త సీఎంగా దళిత ఎమ్మెల్యే చరణ్‌జీత్ సింగ్ చన్నీ (Charanjit Singh Channi) ఎంపికయ్యారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన 24 గంటల్లోనే చరణ్‌జీత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రి (chief minister)గా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. అయితే ఆదివారం చరణ్‌జీత్ సింగ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను కలవడం జరిగింది. ఎమ్మెల్యేల బలం తనకుందని.. ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఈ మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన సమయంలో చరంజీత్కు సంబంధించిన ఓ వీడియో ఇపుడు ఆయనకు తలనొప్పులు తీసుకొచ్చింది. ఈ వీడియో ఈ సమయంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గానూ మారింది.
ఉద్యోగులకు కేటాయింపులు..
సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నట్లు లేఖను గవర్నర్‌కు అందజేసే అవకాశం ఉంది. గవర్నర్ భన్వరీలాల్.. చరణ్‌జీత్ సింగ్చే త ప్రమాణం స్వీకారం (oath) చేయించే అవకాశం ఉంది. అయితే చరంజీత్ సింగ్ చన్నీకి చెందిన ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ (viral on social media) గా మారింది. ఓ ట్రాన్స్ఫర్ (transfer) విషయంలో మంత్రిగా ఉన్న చరణ్‌జీత్ సింగ్ చేసిన ఓ పని ఆ వీడియోలో ఉండటం నవ్వులపాలు చేస్తుంది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు సైతం వస్తున్నాయి. ఇంతకీ ఆ వీడియో (video)లో ఏముందటే.. 2018లో పంజాబ్ ప్రభుత్వంలో టెక్నికల్ ఎడ్యుకేషనల్ & ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మంత్రిగా చరణ్‌జీత్ సింగ్ పనిచేశారు. ఆ సమయంలో టెక్నికల్ ఎడ్యుకేషనల్ విభాగంలో ఉద్యోగుల (employees) ఎంపిక, బదిలీలు జరిగాయి.
37 మంది ఉద్యోగులను వారు కోరుకున్న ప్రాంతాలకు పోస్టింగ్ (posting) ఇచ్చారు. అయితే ఇద్దరికి మాత్రం ఒకే ప్రాంతం కావాలని పట్టుబట్టడంతో సమస్య తలెత్తింది. సమస్య మంత్రి (minister)గా ఉన్న చరణ్‌జీత్ సింగ్ దృష్టికి రావడంతో ఇరువురిని పిలిచి మాట్లాడారు. అంతటితో ఆగకుండా మంత్రి గారు సొంత నిర్ణయం తీసుకున్నారు.
ఇరువురిలో ఎవరికి ఆ ప్రాంతం కేటాయించాలో టాస్ (Toss) వేసి నిర్ణయిద్దామని ప్రపోజల్ పెట్టాడు. అయితే మెరిట్ చూసి ఇవ్వొచ్చని అధికారులు చెప్పినా వినలేదట చరణ్‌జీత్ సింగ్. వెంటనే టాస్ (toss) వేశారు. సమస్య పరిష్కారం అయిందని పంపించేశారు. అయితే ఈ వీడియో అప్పట్లోనే సోషల్ మీడియాలో వచ్చింది. కానీ, ఇపుడు వైరల్ (viral) అవుతోంది. పంజాబ్ భవిష్యత్తు (Punjab future) ఎలా ఉండబోతుందో చూడండంటూ.. నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Punjab New CM Charanjit Singh Channi, uses coin to decide transfer case ?? pic.twitter.com/LSrTHI1YCV
— BALA (@erbmjha) September 19, 2021
అయితే చరణ్‌జీత్ సింగ్ సీఎంగా బాధ్యతలు తీసుకోకముందే కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఆయన ఎదుర్కొన్న ఆరోపణలను బీజేపీ ముందుకు తీసుకొచ్చింది. ఆయనపై ఇదివరకే మీటూ కేసు ఉన్నట్లు గుర్తుచేసింది. బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా దీనిపై ఓ ట్విట్ చేశారు.‘‘ కాంగ్రెస్ కొత్త సీఎంగా ఎన్నికైన చరంజీత్ చన్నీ 3 సంవత్సరాల క్రితం #MeToo కేసులో చర్యను ఎదుర్కొన్నారు. అతను 2018 లో ఒక మహిళా IAS అధికారికి అసభ్యకర సందేశాలు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ విషయాన్ని కప్పిపుచ్చారు. కానీ పంజాబ్ మహిళా కమిషన్ నోటీసు పంపడంతో కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. బాగా చేశారు, రాహుల్.” అని తన పోస్టులో రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: మద్యంతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చంట.. మీ నొప్పులనూ దూరం చేస్తుందట.. ఎలాగంటే
ఇది కూడా చదవండి: ఆ మూడు రాత్రులూ వధూవరులు మూత్రం పోయకుండానే శోభనం చేసుకోవాలంట. ఎక్కడో తెలుసా..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Politics, Punjab, Social Media, Viral Video