PUNJAB CM CHARAN JEET SINGH CHANNY HANDED OVER GOVERNMENT EMPLOYMENT PAPERS TO 11 MEMBERS OF FARMER FAMILIES WHO LOST THEIR LIVES IN THE MOVEMENT AGAINST AGRICULTURAL LAWS PRV
Punjab: రైతుల కుటుంబాలకు పంజాబ్ మరోసారి చేయూత.. చనిపోయిన రైతుల కుటుంబాల్లోని ఒకరికి ఉద్యోగం
ఎర్రకోట వైపు దూసుకు వెళ్లిన రైతులకు పంజాబ్ ప్రభుత్వం మద్దతుగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు పెట్టి అరెస్ట్ కాబడిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రెండు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతేకాదు ఇపుడు పంజాబ్ సీఎం మరో నిర్ణయం తీసుకున్నారు.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు (new agricultural laws) వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు గతేడాది నవంబరు నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. వారి ఆందోళనల్లో భాగంగా... ఈ ఏడాది జనవరి 26 న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ (Tractor rally) హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ హింసాత్మక ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి 83 మంది రైతులను అరెస్టు చేశారు. అయితే ఆ ట్రాక్టర్ ర్యాలీలో పాల్గోని ఎర్రకోట వైపు దూసుకు వెళ్లిన రైతులకు (farmers) పంజాబ్ ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. అరెస్ట్ కాబడిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం (Punjab government) తరుఫున రెండు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ (Punjab Cm charan jeeth singh channi). అంతేకాదు ఇపుడు పంజాబ్ సీఎం మరో నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిన నిరసనలో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం (government job) కల్పించింది. ఈ నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలలోని 11 మంది సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ (Punjab Cm charan jeeth singh channi), రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి రణ్‌దీప్ సింగ్ నాభా శనివారం రైతు కుటుంబాలలోని 11 మంది సభ్యులను నియామక పత్రాన్ని (Employment letter) అందించారు. రైతుల కుటుంబాలను ఆదుకోవాలన్న నిబద్ధతను నెరవేరుస్తూ పంజాబ్ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు సీఎంవో కార్యాలయం (CMO Office) విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
Punjab CM Charanjit Singh Channi today handed over appointment letters as clerks to 11 family members of the farmers who lost their lives in the movement against the three farm laws, his office says pic.twitter.com/6BF8654qEh
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది రైతుల కుటుంబ సభ్యులకు క్లార్క్ జాబ్ నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. మరోవైపు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలంటూ కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా పోరాటం చేసిన అన్నదాతలు ఆందోళనలు విరమించి ఇంటి బాట పట్టారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలకు మోదీ సర్కార్ దిగిరావడం, ఆ చట్టాలను రద్దు చేయడంతో రైతులు తమ నిరసనను ముగించి ఇళ్లకు బయలుదేరారు. ఉద్యమాన్ని ముగిస్తున్నట్లు 40 రైతు సంఘాల సమాఖ్య సంయుక్త్ కిసాన్ మోర్ఛా గురువారంనాడే ప్రకటన చేసిన దరిమిలా వేలాది మంది రైతులు శనివారం నుంచి ఇంటిబాట పట్టారు. ఇన్నాళ్లూ తాము బైఠాయించిన ఢిల్లీ సరిహద్దుల నుంచి రైతులు భారీ ర్యాలీలు, మార్చ్ లతో సొంత ఊళ్లకు వెళ్లిపోయారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.