Home /News /politics /

PUNJAB ASSEMBLY ELECTIONS UP ASSEMBLY ELECTIONS VOTING BEGINS FOR THE THIRD PHASE UP ELECTION SK

Punjab Assembly Elections: పంజాబ్‌లో పోలింగ్ ప్రారంభం.. యూపీలో మూడో దశ ఎన్నికలు

పోలింగ్‌కు సర్వం సిద్ధం

పోలింగ్‌కు సర్వం సిద్ధం

Punjab Assembly Elections 2022: ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. పంజాబ్‌లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాలున్నాయి. 1304 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

  పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల (Punjab Assembly Elections 2022) పోలింగ్‌ ప్రారంభమయింది. ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ (Punjab Polling) మొదలయింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు.  కరోనా నేపథ్యంలో  ఓటర్లు కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.  ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. పంజాబ్‌లోని  మొత్తం 117  అసెంబ్లీ స్థానాలున్నాయి. 1304 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  దీంతో పంజాబ్‌లోని 2.14 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు.  పోలింగ్‌కు సర్వం సిద్ధమైందని పంజాబ్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ (సీఈవో) ఎస్‌ కరుణారాజు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగుల ఓటర్ల కోస ప్రత్యేక ఏర్పాటు చేశామని వెల్లడించారు. వారిని పోలింగ్‌ బూత్‌లకు తీసుకొచ్చి.. ఓటువేసిన తర్వాత తిరిగి ఇంటికి చేర్చే సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా  జరిగేందుకు రాష్ట్ర యంత్రాంగం పగలు రాత్రి శ్రమిస్తోందని పేర్కొన్నారు.



  Nitish-Prashant Kishor Meet: పీకేతో నితీశ్ రహస్య విందు.. BJP కట్టడికి భారీ స్కెచ్?

  పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఏం చేయాలో అన్ని చేశామని.. ఇప్పుడు అంతా ప్రజలు, దేవుడి చేతుల్లోనే పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ (Punjab CM Charanjit Singh Channi) పేర్కొన్నారు. ఈయన చమ్‌కౌర్ సాహిబ్, బాదౌర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. పోలింగ్‌కు ముందు సీఎం ఛన్నీ ఖారార్‌లోని గురద్వారా శ్రీ కతాల్‌గఢ్ సాహిబ్‌ను సందర్శించారు.



  ముంబైకి తెలంగాణ సీఎం..ఉద్దవ్‌థాక్రే, శరద్‌పవార్‌తో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చర్చ

  అటు యూపీలో కూడా మూడో దశ ఎన్నికల పోలింగ్ (UP Elections 2022 ) ప్రారంభమయింది. మూడో దశలో (UP 3rd Phase elections) మొత్తం 16 జిల్లాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు ఓట్లు పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో మొత్తం 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. క్యూలో నిలబడిన ప్రతి ఓటరుకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. మూడో దశలో 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.16 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కర్హాల్ నుంచి బరిలో ఉన్నారు. ఇవాళే అక్కడ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో గట్టి పోలీసులు,కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఎలాంటి అసహ్యకరమైన పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్‌ను కూడా ఏర్పాటు చేశారు.

  కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. అదే రోజు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ప్రకటిస్తారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌‌గా భావిస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Punjab Assembly Elections 2022, UP Assembly Elections 2022, Uttar pradesh, Uttar Pradesh Assembly Elections

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు