Punjab Election Result 2022 in Telugu | పంజాబ్ అసెంబ్లీలో మొత్తం 117 స్థానాలు ఉండగా.. 59 స్థానాలు సాధించిన పార్టీ అధికారంలోకి వస్తుంది. పంజాబ్ లో అన్నీ ఒకే దశలో పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 4న ఎన్నికలు జరిగాయి. 63.44 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
Punjab election Result: పంజాబ్‌లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ తన పరిధిని విస్తరించి హస్తానికి కళ్లెం వేస్తుందా? కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభావం ఎంత ఉంది? బీజేపీని ఎంతమేర ప్రజలు ఆదరించారు? ఈ ప్రశ్నలు అన్నింటికీ మరికొన్ని గంటల్లో సమాధానం రానుంది. పంజాబ్ ఎన్నికల కౌంటింగ్ కౌంట్ డౌన్ జరుగుతోంది. ఈ క్రమంలో అసలు పంజాబ్ గురించి కొంత సమాచారం తెలుసుకుందాం. పంజాబ్ అసెంబ్లీలో మొత్తం 117 స్థానాలు ఉండగా.. 59 స్థానాలు సాధించిన పార్టీ అధికారంలోకి వస్తుంది. పంజాబ్ లో అన్నీ ఒకే దశలో పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 4న ఎన్నికలు జరిగాయి. 63.44 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పలు మీడియా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌లో అధికారం ఆప్‌కు దక్కే అవకాశం ఉందని తేలింది. అయితే కొన్ని సంస్థలు మాత్రం ఆప్, కాంగ్రెస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని వెల్లడించాయి.
Axis my india నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్‌కు 19- 31 సీట్లు, ఆప్‌కు 76 90 సీట్లు, శిరోమణి ఆకాళీదల్కు 7- 11 ‘సీట్లు, బీజేపీకి 1- 4 సీట్లు రావొచ్చని పేర్కొంది. సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ సైతం పంజాబ్‌లో అధికారం ఆప్కే దక్కొచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి 41-49 సీట్లు, ఆప్‌కు 59-57 సీట్లు, బీజేపీ, శిరోమణి అకాళీదళ్ వంటి పార్టీలకు 3-13 సీట్లు రావొచ్చని అభిప్రాయపడింది.
టుడే చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం కాంగ్రెస్‌కు 54, ఆప్‌కు 54 ఇతరులకు 9 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎంఆర్సీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌కు 55, ఆప్‌కు 55, ఇతరులకు 7 సీట్లు రావొచ్చని వెల్లడైంది. మొత్తానికి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, ఆప్ మధ్యే ఉంటుందని.. ఇందులో ఆప్ అదికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
యూపీలో కమలం మళ్లీ వస్తుందన్న సర్వేలు
యూపీలో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. యూపీ తొలి దశలో 11 జిల్లాల పరిధిలోని మొత్తం 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. దాదాపు 59 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రెండో దశలో 60.69 శాతం ఓటింగ్ నమోదైంది. మూడో దశలో 60.69 శాతం పోలింగ్ నమోదైంది. యూపీలో నాలుగో దశలో 9 జిల్లాలలో 59 నియోజక వర్గాలలో ఎన్నికలు జరిగాయి. దీనిలో 61.64 శాతం పోలింగ్ నమోదైంది. అదే విధంగా ఐదో దశలో 12 జిల్లాలలోని 61 నియోజక వర్గాలలో ఎన్నికలు జరిగాయి. దీనిలో 53.98 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. యూపీలో ఆరో దశలో 57 స్థానాల్లో 55.79శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ అధికారులు వెల్లడించారు. ఇక చివరిదైన ఏడో దశలో 54 సీట్లో ఎన్నికలు జరగ్గా 57.5 శాతం పోలింగ్ నమోదైంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.