ఆ పంపు సెట్ల మీటర్లే రైతుల పాలిట తూటాలు: హరీశ్ రావు

కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన కొత్త విద్యుత్ నియంత్రణ చట్టం కింద వ్యవసాయ పొలాల వద్ద ఏర్పాటు చేసే విద్యుత్ మీటర్లు రైతుల పాలిట తూటాలు అవుతాయని తెలంగాణ ఆర్థిక మంత్రి టి.హరీశ్ రావు అన్నారు.

news18-telugu
Updated: September 24, 2020, 6:15 PM IST
ఆ పంపు సెట్ల మీటర్లే రైతుల పాలిట తూటాలు: హరీశ్ రావు
హరీశ్‌రావు(ఫైల్ ఫొటో)
  • Share this:
కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన కొత్త విద్యుత్ నియంత్రణ చట్టం కింద వ్యవసాయ పొలాల వద్ద ఏర్పాటు చేసే విద్యుత్ మీటర్లు రైతుల పాలిట తూటాలు అవుతాయని తెలంగాణ ఆర్థిక మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి‌తో కలసి మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన చట్టంపై మండిపడ్డారు. ‘తెలంగాణలో ముఖ్యమంత్రి తెచ్చిన చట్టానికి రైతులు పాలాభిషేకం చేస్తే.. రైతుల నడ్డి విరిచే చట్టం తెచ్చిన కేంద్ర ప్రభుత్వంపై నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పంపు సెట్లకాడ అమర్చే మీటర్లు.. రైతుల పాలిట తూటాలు అవుతాయి. రూ.600 కోట్లతో లక్ష కల్లాల నిర్మాణం టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపడుతున్నాం. దుబ్బాక లో 548 మంది రైతులకు రైతు భీమా అందించినం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది ఆడబిడ్డ పెళ్లిలకు రూ.5555 కోట్ల ఆర్థిక సాయం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో యేడాదికి రూ.11,700 కోట్లు పింఛన్లను ఖర్చు చేస్తే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది తెలంగాణ కు రూ.700 కోట్లు మాత్రమే. అవినీతి రహితంగా ఆలస్యం జరగకుండా కొత్త రెవెన్యూ చట్టం సీఎం కేసీఆర్ తెచ్చారు. మండలానికో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు పెట్టి రైతు ముంగిట్లో ప్రభుత్వ సేవలు తెచ్చారు. పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకముందే.. రైతు ఖాతాలో రైతుబంధు డబ్బులు జమ చేశాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.2500 కోట్లు వద్దని, మా తెలంగాణ రైతులే మాకు ముద్దు అని సీఎం కేసీఆర్ మాకు చెప్పిండు.’ అని హరీశ్ రావు అన్నారు.

Cash transfer for free electricity for agriculture, Cash transfer for free electricity, free electrictity scheme in andhra Pradesh, Cash transfer for free electricity for agriculture from September, Cash transfer for free electricity for agriculture in Srikakulam district, ysr free electricity for agriculture, ap news, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఏపీ న్యూస్
ప్రతీకాత్మక చిత్రం


కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ చట్టాన్ని టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కొత్త చట్టం ప్రకారం పొలంలోని ప్రతి బోరుకు మీటర్లు పెట్టాలని కేసీఆర్ అన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై దీనిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. కొత్త మీటర్ల కోసం రూ.700 కోట్లు అవసరం ఉంటుందని స్పష్టం చేశారు. మీటర్ రీడింగ్ తీస్తారు.. బిల్లులు ముక్కు పిండి వసూలు చేస్తారన్నారు. కేంద్రం తెచ్చే కొత్త చట్టంతో రాష్ట్రాలకు నియంత్రణ ఉండదని చెప్పుకొచ్చారు. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి ఉందన్నారు. మిగులు విద్యుత్‌ను దేశ ప్రగతికి వినియోగించాలనే ఉద్దేశం కేంద్రానికి లేదని ధ్వజమెత్తారు. కరోనా కారణంగా 3 నెలల బిల్లులు ఒకేసారి వచ్చాయని, విద్యుత్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

pm kisan 12000, pm kisan samman nidhi 12000, pm kisan yojana list, pradhan mantri kisan yojana online form, PM Kisan Scheme money, Pradhan mantri kisan samman nidhi scheme, pm kisan status check, pm kisan scheme aadhaar correction, పీఎం కిసాన్ స్టేటస్ చెక్, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌, ప్రధాన మంత్రి కిసాన్ స్కీమ్ ఆధార్ కరెక్షన్, పీఎం కిసాన్ ఆధార్ కరెక్షన్, పీఎం కిసాన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కరెక్షన్
ప్రతీకాత్మక చిత్రం


అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ చట్టంపై సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గతంలోనే మండిపడ్డారు. ముసాయిదాను ఆధారం చేసుకుని రాజకీయం చేశారని, ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. కొత్త విద్యుత్తు చట్టంపై ఏపీ సీఎం జగన్‌కు లేని ఇబ్బంది కేసీఆర్‌కు ఎలా ఉంటుందో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. దీనిపై అవగాహన లేకపోతే జగన్‌ను మరోసారి భోజనానికి పిలిచి తెలుసుకోవాలని సంజయ్ సూచించారు. కేంద్రం తెచ్చిన విద్యుత్ నియంత్రణ చట్టాన్ని ఏపీ స్వాగతించింది. తెలంగాణ వ్యతిరేకిస్తోంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 24, 2020, 6:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading