జగన్ గురించి పులివెందుల కార్యకర్తల మన్ కీ బాత్.. ఆమంచి నోట..

చీరాలలో సామాజిక కార్యకర్త నాగార్జున రెడ్డిపై హత్యాయత్నానికి తనకు సంబంధం లేదని ఆమంచి స్పష్టం చేశారు. అసలు నాగార్జున రెడ్డి జర్నలిస్ట్ కాదని, గతంలో టీడీపీ ఏజెంట్‌గా పనిచేశారని చెప్పారు.

news18-telugu
Updated: September 26, 2019, 5:17 PM IST
జగన్ గురించి పులివెందుల కార్యకర్తల మన్ కీ బాత్.. ఆమంచి నోట..
కృష్ణమోహన్, జగన్ (File)
news18-telugu
Updated: September 26, 2019, 5:17 PM IST
మే 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ సీఎం అయితే, వైఎస్ పాలనను మరిపిస్తాడని అంతా భావించారు. అందరూ వైఎస్ తరహాలోనే పనిచేస్తారని ఆశించారు. అయితే, వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్తలు మాత్రం వైఎస్ జగన్ గురించి మరోలా ఆలోచిస్తున్నారు. జగన్.. తన తండ్రి వైఎస్‌ను గుర్తు చేస్తాడనుకుంటే.. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను గుర్తు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ వెల్లడించారు. మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ‘151 సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వైఎస్ జగన్. రాష్ట్రంలో అద్భుతమైన పాలన కొనసాగుతోంది. నేను పదిరోజుల క్రితం రెండో బ్లాక్‌ వద్ద ఉంటే పులివెందులకు సంబంధించిన కార్యకర్తలు నన్ను కలిసారు. మా జగన్‌ ఏంటి కేజ్రీవాల్‌ లా వెళ్తున్నారు. అని నన్ను అడిగారు.’ అని ఆమంచి అన్నారు. చీరాలలో సామాజిక కార్యకర్త నాగార్జున రెడ్డిపై హత్యాయత్నానికి తనకు సంబంధం లేదని ఆమంచి స్పష్టం చేశారు. అసలు నాగార్జున రెడ్డి జర్నలిస్ట్ కాదని, గతంలో టీడీపీ ఏజెంట్‌గా పనిచేశారని చెప్పారు.

కడప జిల్లా పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట. వైఎస్ ఉన్నప్పుడు అక్కడి నుంచే వరుసగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా పార్టీ పెట్టినప్పుడు 2011లో వైఎస్ విజయమ్మ పులివెందుల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో తొలిసారి పులివెందుల నుంచి జగన్ పోటీ చేసి 75వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో రెండోసారి అక్కడి నుంచి పోటీ చేసి 90 ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 151 సీట్లతో వైఎస్ జగన్ సారధ్యంలోని వైసీపీ ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

First published: September 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...