• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • PUDUCHERRY CONGRESS CRISIS TWO MORE MLAS QUIT DAY BEFORE FLOOR TEST SU

Puducherry Congress Crisis: పుదుచ్చేరి సంక్షోభం.. బలపరీక్షకు ముందు రోజు కాంగ్రెస్‌కు భారీ షాక్..

Puducherry Congress Crisis: పుదుచ్చేరి సంక్షోభం.. బలపరీక్షకు ముందు రోజు కాంగ్రెస్‌కు భారీ షాక్..

పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి(ఫైల్ ఫోటో)

పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్‌‌లో చోటుచేసుకున్న సంక్షోభం మరింత తీవ్రతరమైంది. అసెంబ్లీ‌లో బలపరీక్షకు ఒక్క రోజు ముందు కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది.

  • Share this:
    పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్‌‌లో చోటుచేసుకున్న సంక్షోభం మరింత తీవ్రతరమైంది. అసెంబ్లీ‌లో బలపరీక్షకు ఒక్క రోజు ముందు కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన లక్ష్మీనారాయణ్ తన పదవికి రాజీనామా చేశారు. తనకు పార్టీలో సరైన గుర్తింపు దక్కకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. ఇక, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటేశ్ కూడా ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన ఎటువంటి ప్రకటన మాత్రం చేయలదే. దీంతో బలపరీక్షకు ముందు రోజు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ కూటమి బలం 12కు పడిపోయింది. దీంతో రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ బలపరీక్షను ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

    30 స్థానాలున్న పుద్చుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్, డీఎంకే, స్వతంత్ర అభ్యర్థిని కలుపుని 18 మంది సభ్యుల మద్దతుతో నారాయణ స్వామి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే గత నెల రోజులుగా పుదుచ్చేరి కాంగ్రెస్‌లో సంక్షోభం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మొత్తం నలుగురు కాంగ్రెస్ సభ్యులు రాజీనామా చేశారు. దీంతో ఆ పార్టీ బలం 14కు చేరింది. అందులో కాంగ్రెస్‌ 10, డీఎంకే 3, స్వతంత్రులు ఒకరు ఉన్నారు. అయితే కాంగ్రెస్‌కు తగినంత మద్దతు లేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.

    ఈ నేపథ్యంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టిన తమిళి సై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం బల పరీక్షకు సిద్ధం కావాలని తెలిపారు. నారాయణస్వామి ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు పుదుచ్చేరి అసెంబ్లీ‌లో బలాన్ని నిరూపించుకోవాలని కోరారు. అయితే బలపరీక్షకు ముందు రోజు పుదుచ్చేరిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సభలో కాంగ్రెస్ కూటమి బలం 12కి పడిపోయింది. మరోవైపు NR కాంగ్రెస్‌-7, అన్నాడీఎంకే-4, బీజేపీ-3(నామినేటెడ్‌) సభ్యులకు కలుపుకుంటే వారికి బలం 14గా ఉంది.

    ఇక, పుదుచ్చేరిలో పరిణామాలపై స్పందించిన సీఎం నారాయణ స్వామి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేయడమే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు