• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • PUDUCHERRY CM NARAYANASAMY RESIGN AFTER LOSING CONFIDENCE VOTE WHAT NEXT NGS

Puducherry: ఎల్జీ తమిళిసై ఏం చేయబోతున్నారు..? పుదిచ్చేరిలో వాట్ నెక్ట్స్

Puducherry: ఎల్జీ తమిళిసై ఏం చేయబోతున్నారు..? పుదిచ్చేరిలో వాట్ నెక్ట్స్

లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసైకి రాజీనామా లేఖ అందిస్తున్న నారాయణ స్వామి

పుదిచ్చేరిలో సీఎం రాజీనామా తరువాత ఏం జరగబోతోంది. తమిళిసై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతం ఆమె ముందు మూడు మార్గాలు ఉన్నాయి. అందులో దేనికి ఆమె ఓటేస్తారో చూడాలి..

  • Share this:
    పుదుచ్చేరిలో అనుకున్నదే జరిగింది. అందరూ ఊహించినట్టే కాషాయ వ్యూహం ఫలించింది. బలపరీక్షకు కొన్ని రోజుల ముందు నుంచే రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారాయి. లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌ బేడీని తప్పించడం, తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో నారాయణ స్వామి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అయితే అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవడంలో సీఎం నారాయణ స్వామి పూర్తిగా విఫలమయ్యారు. దీంతో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసైకు రాజీనామా అందించారు.

    సీఎం రాజీనామాతో ఇప్పుడు పుదుచ్చేరి రాజకీయాల్లో ఏం జరగనుంది. తాజా పరిణామల నేపథ్యంలో లెప్ట్ నెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు చేపట్టిన తమిళిసై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆమె ఏం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకున్నారా..? లేక రాజ్యంగ నిపుణుల నుంచి సలహాలు తీసుకుంటారా..? అయితే ఈ రాజీకాయ డ్రామా అంతా కేంద్ర పెద్దలకు తెలిసే జరుగుతోందని.. వారు చెప్పినట్టే గవర్నర్ చేస్తారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

    ఆమె ముందు ఉన్న ప్రత్యామ్నాయాలను చూస్తే. సీఎం రాజీనామా సమర్పించారు కాబట్టి ఎన్నికలు జరిగే వరకు ఆయననే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించే అవకాశం ఉంది. కానీ అదే జరిగితే బీజేపీ ఇన్ని వ్యూహాలు రచించాల్సిన అవసరం లేదన్నది బహిరంగం రహస్యం. ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా బలం ప్రతిపక్షానికి ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రంగస్వామిని కోరే అవకాశం ఉంది. అయితే ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు కాబట్టి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తో పెద్దగా లాభం ఉండదనే వాదన వినిపిస్తోంది.

    మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫార్సు చేసే అవకాశం ఉంది. దీనికే తమిళిసై మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ఎన్నికల సమాయానికి పుదుచ్చేరి రాజకీయాలు మొత్తం కేంద్రంలో ఉన్న బీజేపీ నియంత్రణలో ఉన్నట్లే. అయితే ఆమె నేరుగా ఆ నిర్ణయం తీసుకుంటారా..? లేదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ప్రతిపక్షాన్ని అడిగిన తరువాత నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాలి.

    ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదని నారాయణ స్వామి భావిస్తే.. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని ఎల్‌జీని కోరే అవకాశాలు ఉంటాయి. అయితే అసెంబ్లీలో విశ్వాసం కోల్పోయిన నేపథ్యంలో ఎల్‌జీ.. ఆయన సలహాను పరిగణలోకి తీసుకునే అవకాశం లేనట్టే. మరోవైపు ప్రస్తుతం తనతో పాటు కేబినెట్‌ మంత్రులు లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు రాజీనామా సమర్పించామని సీఎం నారాయణస్వామి కోరారు. అయితే దీనిపై ఎల్‌జీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలీదు అన్నారు. అలాగే తన తదుపరి కార్యాచరణ ఏంటన్నదానిపైనా నారాయణస్వామి స్పందించలేదు. దీంతో పుదుచ్చేరి తదుపరి రాజకీయ భవిష్యత్తు లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు