రెండు ప్లాటినం గాజుల కథ... పృధ్వి తీవ్ర విమర్శలు

పృథ్విరాజ్

కరకట్టపై కాపురం ఉన్నారు కదా... అప్పుడు రైతులు తమ భూముల్ని చిదిమేసి రోడ్డులు వేస్తున్నారని గగ్గోలు పెట్టినప్పుడు మీరేం ఏం చేస్తున్నారంటూ నారా భువనేశ్వరిరి పృథ్వి ప్రశ్నించారు.

  • Share this:
    చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు వైసీపీ నేత, సినీ నటుడు థర్టి ఇయర్స్ పృథ్వి. భువనేశ్వరి గాజుల డొనేషన్ గాజుల డ్రామా అంటూ ఆరోపణలు చేశారు. సతీమణిని కూడా తీసుకొచ్చి కండువా కప్పి చంద్రబాబు కూర్చొబెట్టారన్నారు. నారా భువనేశ్వరిని తానెప్పుడు చూడలేదన్నారు. కానీ అప్పుడప్పుడు ఫోటోలు,వీడియోల్లోనే చూశానన్నారు. రెండు ప్లాటినమ్ గాజులు ఇచ్చారు కదా... కరకట్టపై కాపురం ఉన్నారు కదా... అప్పుడు రైతులు తమ భూముల్ని చిదిమేసి రోడ్డులు వేస్తున్నారని గగ్గోలు పెట్టినప్పుడు మీరేం ఏం చేస్తున్నారంటూ నారా భువనేశ్వరిరి పృథ్వి ప్రశ్నించారు. వనజాక్షిపై దాడి, రితికేశ్వరి ఘటనల్లో మీరు ఏమయ్యారు అంటూ నిలదీశారు.

    సొంత సామాజిక వర్గాల కోసమే గాజుల డ్రామాఅ అంటూ తీవ్రంగా మండిపడ్డారు పృథ్వి. అప్పుడు అమరావతిలో మూడు పంటలు పండే భూముల్ని లాక్కున్నారంటూ రైతులు ఆందోళనలు చేస్తుంటే... జగన్ నిలదీసినందుకు..  నీకు ఏం తెలుసు. ఏం మాట్లాడుతున్నావంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబును ఇమిటేట్ చేస్తూ పృథ్వి రాజ్ తీవ్ర విమర్శలు  చేశారు. సొంత సామాజిక వర్గాన్ని పెంచి పోషించడానికి రాజధాని అమరావతిలో నిర్మించేందుకు ప్రయత్నించారని విమర్శలు గుప్పించారు.
    Published by:Sulthana Begum Shaik
    First published: