తెలుగు సినీ పరిశ్రమపై పృథ్వీ రాజ్ సంచలన వ్యాఖ్యలు

వాళ్లు కోరుకున్న వ్యక్తి చంద్రబాబు.. ఆయన గెలవలేదు కాబట్టి వాళ్లు హ్యాపీగా లేరన్నారు పృథ్వీ.

news18-telugu
Updated: October 13, 2019, 4:26 PM IST
తెలుగు సినీ పరిశ్రమపై పృథ్వీ రాజ్ సంచలన వ్యాఖ్యలు
పృథ్వీ రాజ్
  • Share this:
ప్రముఖ సినీనటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ ఫృథ్వీరాజ్ మరోసారి తెలుగు చలన చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు పరిశ్రమపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ అవ్వడం సినీ ఇండస్ట్రీకి ఇష్టం లేదన్నారు. అందుకే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసి ఇన్నిరోజులు గడుస్తున్న ఒక్కరు కూడా వచ్చి ఆయనను అభినందించలేదన్నారు. వాళ్లు కోరుకున్న వ్యక్తి చంద్రబాబు.. ఆయన గెలవలేదు కాబట్టి వాళ్లు హ్యాపీగా లేరన్నారు. అయితే జగన్ మాత్రం సీనీ పరిశ్రమ నుంచి ఏమీ కోరుకోవడం లేదన్నారు. నాలుగు నెలలకే జగన్ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. మరికొన్నేళ్ల పాటు జగన్ మోహన్ రెడ్డియే ఏపీ సీఎంగా గెలుస్తారన్నారు.

కానీ సినిమావాళ్లు మాత్రం మనం హైదరాబాద్‌లో ఉంటాం కదా జగన్‌తో మనకేం పని అనుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఉంట ఆంధ్రాలో షూటింగ్‌లకు రారా అంటూ పృథ్వీ ప్రశ్నించారు. చంద్రబాబు గెలిస్తే మాత్రం అంతా చంకలు గుద్దికొని వెళ్లి ఆయనను కలిసేవారంటూ ఎద్దేవా చేశారు. ఎవరూ గెలిచినా చిత్ర పరిశ్రమ మాత్రం అంతా కలిసి నడవాలన్నారు. మనకు చిత్ర పరిశ్రమ అభివృద్ధి ముఖ్యమన్నారు. నాకు అన్నం పెట్టింది సినిమా రంగమే అన్న పృథ్వీ... రాజకీయాలంటూ మాత్రం తనకు చాలా ఇష్టమన్నారు. దివంగత వైఎస్ఆర్‌కు తాను వీరాభిమానినని చెప్పుకొచ్చారు.

ఇవికూడా చూడండి:

జపాన్‌లో తుఫాను బీభత్సంFirst published: October 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు