పంజాబ్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం జరిగింది. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే ఆయనపై దాడి జరిగింది. కొందరు ఆందోళన కారులు ఆయన దుస్తులను చింపి చితకబాదారు. పోలీసులు సమక్షంలో ఈ ఘటన జరిగింది. బీజేపీ పార్టీకి చెందిన అబోహర్ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్ శనివారం మలోట్ పట్టణానికి వెళ్లారు. అక్కడి బీజేపీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలని అనుకున్నారు. కానీ ఆయన రాకకు ముందే బీజేపీ కార్యాలయం ముందు ఆందోళనకారులు భారీగా మోహరించారు. కొత్త వ్యవసాయ చట్టాలపై గుర్రుగా ఉన్న అక్కడి రైతులు.. అరుణ్ నారంగ్ రాగానే కారును అడ్డుకున్నారు. ఆయనపై ఇంక్ చల్లి రచ్చ రచ్చ చేశారు. పోలీసులు ఆయన్ను సమీపంలో ఉన్న దుకాణంలోకి తీసుకెళ్లారు.
కాసేపటి తర్వాత మళ్లీ బయటకొచ్చారు ఎమ్మెల్యే అరుణ్ నారంగ్. అక్కడే ఉన్న ఆందోళనకారులు మరోసారి ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. ఆయన దుస్తులు చింపేసి విచక్షణా రహితంగా దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. బట్టలు పూర్తిగా చినిగిపోవడంతో ఆయనకు నడిరోడ్డుపై ఘోరమైన అవమానం జరిగింది. పోలీసుల భద్రత మధ్య ఆయన బీజేపీ కార్యాలయంలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేపై జరిగిన ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
@RahulGandhi WTF IS HAPPENING IN PUNJAB?????? This attack is not on the BJP MLA, it's the Khalistani terrorists showing their true colour and their intentions. 🤬🤬🤬 https://t.co/8Xe4xf5z2z
అరుణ్ నారంగ్‌తో పాటు మరో ఇద్దరు బీజేపీ నేతలపైనా దాడి జరిగినట్లు తెలిసింది. అంతేకాదు కొందరు ఆందోళనకారులు బీజేపీ కార్యాలయంలోకి చొరబడి ఆ పార్టీ జెండాలను తగులబెట్టారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. సాక్షాత్తు ఒక ప్రజా ప్రతినిధిపై జరిగిన ఈ దాడిపై పంజాబ్‌తో పాటు దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. అరుణ్ నారంగ్‌పై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. రైతుల ముసుగులో కాంగ్రెస్ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఘటనపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి దాడులు ఉపేక్షించేది లేదని..ఎమ్మెల్యేపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
కాగా, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులో కొన్ని నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని.. అప్పటి వరకు ఇక్కడే ఉంటామని రైతులు బైఠాయించారు. టిక్రీ, సింఘూ, ఘజియాబాద్‌లో గుడారాలు ఏర్పాటు చేసుకొని నిరసనలు కొనసాగిస్తున్నారు. వీరిలో పంజాబ్‌కు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ పంజాబ్‌లోనూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, ఇతర పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈక్రమంలోనే శనివారం బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌పై దాడి జరిగింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.