దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటనలో బాధితురాలి తల్లిదండ్రులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీలు తమకు న్యాయం చేయడం లేదని, వాటిపై తాము విశ్వాసం కోల్పోయామని, అందువల్ల తాము ఓ నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. రాజకీయ పార్టీల వాగ్దానాలు ఎన్నికల్లో విజయానికి చేసే జిమ్మిక్కులేనని, ఈ ఎన్నికల్లో ఓటు ఓటేయాలనిపించట్ల్లేదని ఆశాదేవి, బద్రీనాథ్ సింగ్ దంపతులు గురువారం పేర్కొన్నారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఏమీ చేయని రాజకీయ పార్టీలతో తాము అలసిపోయామని అన్నారు. తమ కుమార్తెపై దారుణానికి పాల్పడిన నేరస్తులు ఇంకా బతికే ఉండటాన్ని బట్టి.. పార్టీలు వ్యక్తం చేసిన సానుభూతి, వారిచ్చిన హామీలు అన్నీ కేవలం ఓ ‘రాజకీయ గిమ్మిక్కు’గా తేలిపోయిందన్నారు. మహిళలు, పిల్లలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టడం లేదని వారు విమర్శించారు.
అన్ని పార్టీలు మహిళల ఆత్మగౌరవం, సాధికారత గురించి మాట్లాడుతాయి. కార్యాచరణ మాత్రం లేదు అని బద్రీనాథ్ వాపోయారు. తమ కూతురు చనిపోయి ఏడేండ్లయినా దోషులకు శిక్ష అమలు కాలేదని, ఇది వ్యవస్థ లోపమని నిర్భయ తల్లిదండ్రులు దుయ్యబట్టారు.
ఇది కూడా చూడండి :-
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Delhi Lok Sabha Elections 2019, Delhi news, Gang rape, India, New Delhi, New Delhi S30p04, Nirbhaya, Police, RAPE, Vote