జగన్ ఆరు నెలల పాలన... ప్రొగ్రెస్ రిపోర్ట్

తాను ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకునేందుకు ప్రయత్నిస్తానని ప్రమాణస్వీకారం రోజే సీఎం జగన్ ప్రకటించారు.

news18-telugu
Updated: November 29, 2019, 7:47 PM IST
జగన్ ఆరు నెలల పాలన... ప్రొగ్రెస్ రిపోర్ట్
సీఎం జగన్
  • Share this:
`నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ..ఏపీ ప్రజల్లోకి వెళ్లి తిరుగులేని విజయం సాధించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... మే 30న సీఎంగా ప్రమాణం చేశారు. న‌వంబ‌ర్30 నాటికి ఆయన పాలనకు ఆరు నెల‌లు పూర్తి అవుతోంది. మాట తప్పను... మడమ తిప్పను అని చెప్పుకునే జగన్... ఈ ఆరు నెలల్లోనే పాలనపరంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. `ఆరు నెల‌ల నుంచి ఏడాది స‌మ‌యం ఇవ్వండి.. న‌న్ను నేను నిరూపించుకుంటా` అని ప్రమాణస్వీకారం రోజే సీఎం జగన్ ప్రకటించారు. పింఛ‌న్‌ మూడు వేల‌కు పెంచుతాన‌ని హామీ ఇచ్చినా.. రూ. 250 మాత్రమే పెంచి... ఐదేళ్లలో రూ. 3 వేల‌కు పెంచుకుంటూ పోతాన‌ని చెప్పడంతో చాలామంది నిరాశ చెందారు.

ఆ స‌మ‌యంలో జగన్ కూడా చంద్రబాబు లాంటి నాయ‌కుడేన‌ని పెద‌వి విరిచారు. వాలంటీర్ల నియామ‌కం చేస్తాన‌ని చెప్పడంతో... ఇది కూడా మరో జన్మభూమి కమిటీలు అవుతాయేమో అని భావించారు. అయితే ఈ నియామకాల్లో ఎక్కువ విమర్శలు రాకుండా చేయడంలో జగన్ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. ఆరోగ్య శ్రీ, అమ్మ ఒడి, అగ్రిగోల్డ్ బాధితుల‌కు చెల్లింపులు, ఆటోవాలాల‌కు ఆర్థిక సాయం, మ‌త్య్సకార భరోసా, రైతు భ‌రోసా, నాయీ బ్రాహ్మణులకు హామీలు వంటివి సీఎం జగన్ అమలు చేశారు. దీంతో పాటు మరిన్ని పథకాలను ప్రవేశపెట్టారు. ఇక ఇసుక కొరత ఏర్పడటం జగన్ ప్రభుత్వానికి విపక్షాల నుంచి ఎదురైన తొలి పెద్ద సమస్య. దీని నుంచి బయటపడేందుకు వైసీపీ ప్రభుత్వం బాగానే శ్రమించింది. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై వచ్చిన విమర్శలను వైసీపీ ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొట్టింది.

చంద్రబాబు చేసిన తప్పులు తాను చేయకుండా ఉండాలని సీఎం జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. అమరావతి విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టం లేకపోవడం కొంత ఇబ్బందిగా మారింది. ఇక ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకునే విషయంలో వైసీపీ ఏ రకంగా వ్యవహరిస్తుందని ఇంకా తేలాల్సి ఉంది. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సాయం అందలేదనే భావనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం... భవిష్యత్తుల్లో కేంద్రం నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునే దిశగా ఒత్తిడి చేయాలని భావిస్తోంది.

పాల‌నా ప‌రంగా ఈ ఆరు నెల‌లు మంచి మార్కులే ప‌డినా.. పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమర్శలు కూడా ఉన్నాయి. పార్టీకి ప్రభుత్వానికి అంతగా సమన్వయం లేదనే భావన వైసీపీ శ్రేణుల్లోనూ కనిపిస్తోంది.


First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>