ఏపీలో గెలుపు ఎవరిదో? చెప్పేసిన ప్రొఫసర్ నాగేశ్వర్

మాజీ ఎమ్మెల్సీ ప్రొ.కే.నాగేశ్వర్

60 సీట్లలో టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ 60 సీట్లలో సాగిన హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది. టీడీపీ అధికారంలోకి రావాలంటే.. ఈ 60 సీట్లలో కనీసం 45 సీట్లు గెలవాల్సి ఉంటుంది.

  • Share this:
    ఏపీలో గెలిచేదెవరు.. ఇప్పుడు ఈ ప్రశ్నకు ఎవరిదగ్గర సరైన సమాధానం లేదు. ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఏపీలో గెలుపు ఎవరిదోనన్న లెక్కను అంచనా వేయలేకపోతున్నారు.కొందరు జగన్ అంటే... మరికొందరు చంద్రబాబు అంటున్నారు. తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కూడా వీటికి సరైన సమాధానం చెప్పలేకపోయాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జగన్ గెలుస్తాడని చెప్పినా.. టీడీపీ కూడా విజయం సాధిస్తుందని కొన్ని సర్వేలు అంటున్నాయి. దీంతో ఏపీలో గెలుపు ఎవరిది అన్న సస్పెన్స్‌కు తెర పడటం లేదు. తాజాగా ఏపీలో ఎగ్జిట్ పోల్స్ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ ఇంటర్య్వూలో ఏపీలో గెలుపు ఎవరిది అన్న దానిపై విశ్లేషణ చేశారు. ఎన్నికల ఫలితాలపై ఆయన ఎలాంటి సర్వేలు చేయించలేదన్నారు.కానీ .. కేవలం విశ్లేషించి మాత్రమే గెలుపోటములపై లెక్కలు అంచనా వేశానన్నారు.

    ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 175. అందులో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే సీట్లు.. 50 వరకూ ఉన్నాయి. దీన్ని అంతా అంగీకరిస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కచ్చితంగా గెలిచే సీట్లు 65 వరకూ ఉన్నాయి. దీన్ని లగడపాటి కూడా చెబుతున్నారు. సో.. ఇవిపోగా ఇంకా మిగిలినవి 60 సీట్లు. ఈ 60 సీట్లలో టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ 60 సీట్లలో సాగిన హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది. టీడీపీ అధికారంలోకి రావాలంటే.. ఈ 60 సీట్లలో కనీసం 45 సీట్లు గెలవాల్సి ఉంటుంది. కానీ ఇది సాధ్యమా.. అంటే అసాధ్యం కాకపోయినా చాలా కష్టం అని చెప్పొచ్చు అంటున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. కానీ ఈ 60 సీట్లలో కనీసం 45 సీట్లు గెలిచి చంద్రబాబు గెలిస్తే అది నిజంగా అద్భుతమే.. అంటున్నారు నాగేశ్వర్. అంటే నూటికి 80 శాతం విజయావకాశాలు జగన్‌కే ఉన్నాయని ఆయన చెప్పకనే చెబుతున్నారు. చంద్రబాబు గెలవడం అద్భుతమే అంటే...జగన్‌కు ఆ 60 సీట్లలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అంచనా వేస్తున్నారు.
    First published: