2018 పొలిటికల్ మ్యాచ్‌...కేసీఆరే ‘మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్’

2018 సంవత్సరం బీజేపీకి బ్యాడ్ ఇయర్‌గా పేర్కొన్న ప్రొ.నాగేశ్వర్...ఈ సంవత్సరంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అజేయుడన్న భావనకు తెరపడిందని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: December 31, 2018, 4:29 PM IST
2018 పొలిటికల్ మ్యాచ్‌...కేసీఆరే ‘మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్’
ప్రొఫెసర్ నాగేశ్వర్ (ట్విట్టర్)
news18-telugu
Updated: December 31, 2018, 4:29 PM IST
2018 సంవత్సరపు పొలిటికల్ మ్యాచ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫసక్ కే.నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 సీట్లు సాధిస్తుందని ముందే ప్రకటించిన కేసీఆర్...90 సీట్ల వరకు గెల్చుకోవడం గొప్ప విషయమని అన్నారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనుకూల పవనాలు వీచినా...తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ హవాను కేసీఆర్ అడ్డుకోగలిగారని చెప్పారు. తెలంగాణకు సంబంధించినంత వరకు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు నాకౌట్ అయ్యాయని అన్నారు.

అలాగే 2018 సంవత్సరపు పొలిటికల్ మ్యాచ్‌లో రాహుల్ గాంధీని మ్యాచ్ ఆఫ్ ది సిరీస్‌గా అభివర్ణించారు. ఐదేళ్లుగా ఎన్నో పరాజయాలు, అవమానాలు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ...మూడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడపడంతో పాటు కర్ణాటకలోనూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ సారథ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తోందన్నారు. 2018 సంవత్సరం బీజేపీకి బ్యాడ్ ఇయర్‌గా పేర్కొన్న ప్రొ.నాగేశ్వర్..ఈ సంవత్సరంలోనే నరేంద్ర మోదీ అజేయుడన్న భావనకు తూట్లు పడ్డాయని వ్యాఖ్యానించారు. 2019లో జరిగే ఫైనల్ మ్యాచ్‌ ద్వారా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలని ఆకాంక్షించారు.


First published: December 31, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...