Prof K Nageshwar: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న ప్రొఫెసర్ నాగేశ్వర్

Prof K Nageshwar to contest in elections: తాను స్వతంత్రుడనని వ్యాఖ్యానించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ఏయే వర్గాల ప్రజలు తనకు ఎందుకు ఓటు వేయాలనే విషయాన్ని తాను సవివరంగా చెబుతానని తెలిపారు.


Updated: September 30, 2020, 11:25 PM IST
Prof K Nageshwar: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న ప్రొఫెసర్ నాగేశ్వర్
ప్రొఫెసర్ కె నాగేశ్వర్
  • Share this:
మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టుభద్రుల నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. తాను తన కోసం పోటీ చేయడం లేదని.. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు బరిలోకి దిగుతున్నానని ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తాను స్వతంత్రుడనని వ్యాఖ్యానించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ఏయే వర్గాల ప్రజలు తనకు ఎందుకు ఓటు వేయాలనే విషయాన్ని తాను సవివరంగా చెబుతానని తెలిపారు.

తాను ఎవరినో అడ్డుకోవడానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. తాను చట్టసభలకు వెళ్లేందుకు మాత్రమే పోటీ చేస్తున్నానని అన్నారు. ఏ అంశంపైనైనా తాను తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెబుతానని వెల్లడించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. తన భవిష్యత్తుల్లోనూ ఇదే ధోరణితో ముందుకు సాగుతానని అన్నారు. తాను ప్రజల పక్షాన మాట్లాడతానని ఆయన తెలిపారు. ప్రజలకు మంచి చేస్తే ఎవరి చర్యలనైనా స్వాగతిస్తానని.. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఎవరినైనా వ్యతిరేకిస్తానని ప్రొఫెసర్ నాగేశ్వర్ కామెంట్ చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కావాల్సినంత డబ్బు తన దగ్గర లేదని.. ఇందుకోసం డబ్బు ఎలా సమీకరించాలనే దానిపై కూడా ఆలోచన చేస్తున్నానని ఆయన అన్నారు.

తాను ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టబోనని.. గెలిచిన తరువాత సంపాదించుకునేది కూడా ఏమీ ఉండదని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. నాగేశ్వర్ ఎమ్మెల్సీ పోటీ చేస్తానని ప్రకటించడంతో ఆయనకు ఏయే పార్టీలు మద్దతు ఇస్తాయనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి గతంలో ఓసారి ఎమ్మెల్సీగా తనదైన మార్కు చూపించిన నాగేశ్వర్.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన విశ్లేషణలతో ఎంతోమందిని ప్రభావితం చేసే ప్రొఫెసర్ నాగేశ్వర్.. ఈ ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపుతారన్నది వేచి చూడాలి.
Published by: Kishore Akkaladevi
First published: September 30, 2020, 11:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading