Home /News /politics /

PRIYANKA GANDHI VADRA JYOTIRADITYA SCINDIA HOLD A MEETING TO DISCUSS POLL STRATEGY

యూపీలో ప్రియాంక గాంధీ తీసుకున్న తొలి రాజకీయ నిర్ణయం

జ్యోతిరాథియ్య సింథియా, రాజ్ బబ్బర్‌తో ప్రియాంక గాంధీ(ఫైల్ ఫోటో)

జ్యోతిరాథియ్య సింథియా, రాజ్ బబ్బర్‌తో ప్రియాంక గాంధీ(ఫైల్ ఫోటో)

యూపీలో పీసీసీ అధ్యక్షుడిగా రాజ్ బబ్బర్‌నే కొనసాగించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, జ్యోతిరాధిత్య సింథియా కీలక నిర్ణయం తీసుకున్నారు.

    యూపీలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపేందుకు అనుసరించాల్సిన వ్యూహాల్లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తలమునకలైయ్యారు. తూర్పు యూపీ పార్టీ వ్యవహారాల ఇంఛార్జికి నియమితులైన ఆమె...పశ్చిమ యూపీ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి జ్యోతిరాథిత్య సింథియా, యూపీ పీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్‌తో గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. యూపీలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించారు. ప్రధానంగా యూపీ పీసీసీ చీఫ్ మార్పు అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికలకు మరో మూడు మాసాలే ఉండడంతో యూపీ పీసీసీ చీఫ్‌ను మార్చకూడదని...ప్రస్తుతానికి ఆ పదవిలో ఉన్న పార్టీ సీనియర్ నేత రాజ్ బబ్బర్‌నే కొనసాగించాలని నిర్ణయించారు.

    ఇటీవల ప్రియాంక గాంధీని కలిసిన యూపీ కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ బబ్బర్ పనితీరుపై కొన్ని ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. పార్టీ ప్రచారంలో ఆయన కీలక పాత్ర పోషిస్తూ...పార్టీ నిర్వహణలో ఆయన తన పనితీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. కార్యకర్తల సూచన మేరకు రాజ్ బబ్బర్‌కు ప్రియాంక గాంధీ, జ్యోతిరాధిత్య సింథియా కీలక సలహాలు, సూచనలు చేసినట్లు తెలుస్తోంది. యూపీకి ఇద్దరు పీసీసీ చీఫ్‌లను నియమించాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చుతూ ఈ సమావేవంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
    Published by:Janardhan V
    First published:

    Tags: Congress, Lok Sabha Election 2019, Priyanka Gandhi, Uttar pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు