• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • PRIYANKA GANDHI VADRA AND REVANTH REDDY PRIVATE DISCUSSION AT BENGALURU DID SHE DROP ANY HINT BA

Revanth Reddy: రేవంత్ రెడ్డికి ప్రియాంకా పిలుపు... బెంగళూరు చర్చల్లో ఏం జరిగింది?

Revanth Reddy: రేవంత్ రెడ్డికి ప్రియాంకా పిలుపు... బెంగళూరు చర్చల్లో ఏం జరిగింది?

ప్రియాంకా గాంధీ వాద్రా (File)

కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ మనవడు, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య పెళ్లి వేడుక ఇటీవల జరిగింది. ఆ పెళ్లికి సంబంధించి విందు కార్యక్రమం ఓ హోటల్లో జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రియాంకా గాంధీ వాద్రా కూడా హాజరయ్యారు.

  • Share this:
    తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా కొద్దిసేపు ప్రైవేట్‌గా చర్చించినట్టు తెలిసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఓ వివాహ విందుకు రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ మనవడు, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య పెళ్లి వేడుక ఇటీవల జరిగింది. ఆ పెళ్లికి సంబంధించి విందు కార్యక్రమం ఓ హోటల్లో జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రియాంకా గాంధీ వాద్రా కూడా హాజరయ్యారు. తిరిగి వెళ్తున్న సమయంలో కారులో ఎక్కిన ప్రియాంకా గాంధీ వాద్రా అక్కడకు కొంచెం దూరంలో ఉన్న ప్రియాంకా గాంధీని పిలిచి చర్చించినట్టు తెలిసింది. వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారని సమాచారం. మిగిలిన కాంగ్రెస్ నేతలు కొంచెం దూరంగా కూర్చుని చూస్తుండగానే ప్రియాంకా గాంధీ గన్ మెన్ వచ్చిన రేవంత్ రెడ్డిని ఆమె వద్దకు తీసుకుని వెళ్లినట్టు సమాచారం.

    ప్రియాంకా గాంధీ, రేవంత్ రెడ్డి మధ్య ఎలాంటి చర్చ జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల రేవంత్ రెడ్డి రైతుయాత్ర చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా ఆయన చేపట్టిన పాదయాత్ర రెండు రోజుల క్రితం ముగిసింది. మరోవైపు మార్చిలో మరోసారి పెద్ద ఎత్తున రైతుల సభ నిర్వహించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ఢిల్లీలో రైతుల పోరాటానికి నేతృత్వం వహిస్తున్న తికాయత్‌ను కూడా ఆహ్వానించారు.

    తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి రేసులో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. చాలా మంది రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. నిన్న, మొన్న వచ్చిన రేవంత్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా చేస్తే పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నాయకులు అందరూ వెళ్లిపోతారనే అభిప్రాయాలను కొందరు నేతలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రియాంకా గాంధీ ప్రత్యేకంగా రేవంత్ రెడ్డిని పిలిచి చర్చించడం విశేషం.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: