కాంగ్రెస్ సారథ్య పగ్గాలు చేపట్టబోనన్న ప్రియాంక...రేసులో మరికొన్ని పేర్లు...

Priyanka Gandhi News | సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యతవహిస్తూ తన సోదరుడు రాహుల్ గాంధీ త్వజించిన పార్టీ అధ్యక్ష పదవిని తాను ఎట్టిపరిస్థితిలోనూ చేపట్టబోనని ప్రియాంక గాంధీ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: July 24, 2019, 6:52 PM IST
కాంగ్రెస్ సారథ్య పగ్గాలు చేపట్టబోనన్న ప్రియాంక...రేసులో మరికొన్ని పేర్లు...
ప్రియాంక గాంధీ(File)
  • Share this:
కాంగ్రెస్ సారథ్య బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ తప్పుకోవడంతో ఆయన స్థానంలో ప్రియాంక గాంధీ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని పార్టీ సీనియర్లు కోరడం తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టే ప్రసక్తే లేదని పార్టీ సీనియర్లకు ప్రియాంక గాంధీ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుత హోదాలోనే పార్టీకి సేవ చేస్తామని ఆమె స్పష్టంచేసినట్లు సమాచారం. పార్టీ సారథ్య పగ్గాలు చేపట్టాలని మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ తనయుడు అనిల్ శాస్త్రీ, సీనియర్ నేత నట్వర్ సింగ్, మాజీ ఎంపీ శత్రుఘ్న సిన్హా తదితరులు కోరిన నేపథ్యంలో ఆమె తన వైఖరిపై క్లారిటీ ఇచ్చారు.

సోన్ భద్ర వివాదంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ను ఇరుకున పెట్టేలా ప్రియాంక గాంధీ దూకుడు ప్రదర్శించారు. దీంతో ఆమె కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టబోనని ఆమె క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

rahul gandhi,priyanka gandhi,sonia gandhi,priyanka gandhi vadra,priyanka gandhi speech,rahul gandhi speech,indira gandhi,priyanka gandhi son,priyanka gandhi house,rahul gandhi news,rahul gandhi latest speech,rahul gandhi priyanka gandhi,రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ,
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ (File)


మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యతవహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన స్థానంలో పార్టీ సీనియర్లు కొత్త సారధిని ఎంపిక చేసుకోవాలని సూచించారు. పలువురు పార్టీ నేతలు, మిత్రపక్షాల నేతలు బుజ్జగించినా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే విషయంలో రాహుల్ వెనక్కి తగ్గలేదు.

కాగా ప్రియాంక గాంధీ కూడా రేసు నుంచి తప్పుకోవడంతో ఇక కాంగ్రెస్ సారథ్య పగ్గాలు ఎవరు చేపట్టనున్నారన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొందరి పేర్లు వినిపించాయి.  మల్లికార్జున ఖర్గే, సుశీల్ కుమార్ షిండే, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింథియా తదితరుల పేర్లు వినిపించాయి. అయితే పార్టీ సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అధ్యక్షుడి ఎంపిక జఠిలంగా మారుతోంది.

sonia gandhi,congress,rahul gandhi,congress parliamentary party,congress parliamentary party meeting,upa chairperson sonia gandhi,congress president rahul gandhi,rahul gandhi latest news,priyanka gandhi as congress general secretary,priyanka gandhi,rahul gandhi resignation,rahul gandhi resigns,leader of congress,rahul gandhi news,sonia gandhi after election results,rahul gandhi at congress meet, సోనియాగాంధీ, సోనియా, రాహుల్, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ
సోనియా గాంధీ


పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై కొత్త సారథిని ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నాక సీడబ్ల్యూసీ సమావేశాన్ని సోనియాగాంధీ ఏర్పాటు చేస్తారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎంపికకావడం ఆలస్యమయ్యే పక్షంలో మరో ఆరు మాసాలకు తాత్కాలిక అధ్యక్షుడు ఒకరిని ఎన్నుకుని ముందుకు వెళ్లే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Published by: Janardhan V
First published: July 24, 2019, 6:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading