Home /News /politics /

PRIYANKA GANDHI TO KICK START ELECTION CAMPAIGNING IN UP TAKING RIVER ROUTE TO COVER 100 KMS FROM 18TH MARCH BA

ప్రియాంకాగాంధీ మెగా రివర్ షో.. బోటులో 100 కిలోమీటర్ల మేర ప్రచారం...

ప్రియాంక గాంధీ

ప్రియాంక గాంధీ

మార్చి 18 నుంచి మార్చి 20 వరకు ప్రియాంకాగాంధీ యూపీలో ప్రచారం చేయనున్నారు. ఆమె పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసింది.

    కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారాన్ని ఈనెల 18న ప్రారంభించనున్నారు. గుజరాత్‌లో జరిగిన సమావేశంలో తొలిసారి పార్టీ వేదికపై ప్రసంగించిన ప్రియాంకా గాంధీ వాద్రా.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. అందుకు ఆమె రోడ్డు మార్గం కాకుండా నదీ మార్గం ఎంచుకోవడం విశేషం. ఈనెల 18న ప్రయాగ్ రాజ్ నుంచి వారణాసి వరకు సుమారు 100 కిలోమీటర్ల మార్గంలో ఆమె ప్రచారం చేయనున్నారు. అయితే, ఆమె ఈ ప్రచారం అంతా బోటులో ప్రయాణిస్తూ చేస్తారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో నివసించే వారు, రోడ్డు మార్గం లేని వారిని గ్రామాల్లో ఓటర్లను కూడా ఆకట్టుకునే క్రమంలో ప్రియాంకాగాంధీ ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. వాస్తవానికి శుక్రవారం (మార్చి 15) నుంచే ఆమె ఉత్తరప్రదేశ్‌లో ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే, ఆమె పర్యటన వాయిదా పడింది.

    రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా


    మార్చి 18 నుంచి మార్చి 20 వరకు ప్రియాంకాగాంధీ యూపీలో ప్రచారం చేయనున్నారు. ఆమె పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసింది. అయితే, ఈసీ నుంచి అనుమతి వస్తుందని హస్తం నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తన ముత్తాత, భారత దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన ప్రయాగ్‌రాజ్ నుంచి ప్రచారాన్ని ప్రారంభించడం ద్వారా ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపనున్నారని యూపీ కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. అయితే, ఆమె ప్రచారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి వరకు సాగనుంది. ఆ రకంగా మోదీ సొంత నియోజకవర్గంలో ప్రియాంకా గాంధీ వాద్రా ప్రచారం కేడర్‌‌లో జోష్ నింపుతుందని ఆశిస్తున్నారు.

    priyanka gandhi,congress,congress campaign,priyanka gandhi campaign,lok sabha polls 2019,Anshu Awasthi,UPCC,ప్రియాంకాగాంధీ,ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం,యూపీలో ఎన్నికల ప్రచారం,ప్రియాంకాగాంధీ
    రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా


    బోటు ప్రయాణంతో పాటు అలహాబాద్‌లో ఆనంద్ భవన్‌ (నెహ్రూ ఒకప్పటి అధికారిక నివాసం. ఆ తర్వాత దాన్ని మ్యూజియంగా మార్చారు) ను కూడా ప్రియాంకాగాంధీ సందర్శించనున్నారు. అక్కడే మోతీ లాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ వినియోగించిన వస్తువులు ఉన్నాయి. మిర్జాపూర్‌లోని వింద్యావాసిని, వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని ప్రియాంకాగాంధీ సందర్శించనున్నారు.
    First published:

    Tags: Congress, Lok Sabha Election 2019, Pm modi, Priyanka Gandhi, Rahul Gandhi, Uttar pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు