ప్రియాంక గాంధీ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు..

భద్రతా వైఫల్యం కారణంగానే ఇది జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఐతే ఈ విషయం తమ దృష్టికి రాలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

news18-telugu
Updated: December 2, 2019, 7:35 PM IST
ప్రియాంక గాంధీ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు..
భద్రతా వైఫల్యం కారణంగానే ఇది జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఐతే ఈ విషయం తమ దృష్టికి రాలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
  • Share this:
ఢిల్లీలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నివసిస్తున్న ఇంట్లోకి ఓ కారు దూసుకెళ్లింది. ఇంటి సమీపంలో ఉన్న భద్రతా వ్యవస్థను దాటుకొని లోపలికి వెళ్లింది. ఆ కారులో ఓ మహిళతో పాటు మరో నలుగురు ఉన్నారు.  నవంబరు 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  అత్యంత భద్రత ఉండే ప్రియాంక గాంధీ ఇంట్లోకి భద్రతా వ్యవస్థ కళ్లు గప్పి ఐదుగురు వ్యక్తులు వచ్చారు.  ఆ సమయంలో  ప్రియాంక గాంధీ గార్డెన్‌లో ఉన్నారు. అకస్మాత్తుగా వారు రావడం చూసి ఆమె షాక్ అయ్యారు. ఎలాంటి ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండానే  ఆ ఐదుగురు ఆమెను కలిసినట్లు తెలుస్తోంది. ఐతే వారు సెల్ఫీ కోసం వెళ్లినట్లు సమాచారం.

ఇటీవలే సోనియా గాంధీ కుటుంబ సభ్యులకు ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) భద్రతను తొలగించింది కేంద్రం. గాంధీ ఫ్యామిలీకి ఎలాంటి ప్రత్యక్ష ముప్పు లేదని పలు నిఘా ఏజెన్సీలు వెల్లడించిన నేపథ్యంలో వారికి SPG భద్రతను ఉపసంహరించారు. ఎస్పీజీకి బదులుగా CRPF సిబ్బందితో జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఐతే కేంద్రం ఎస్పీజీ తొలగించిన కొన్ని రోజులకే ప్రియాంక నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు భద్రతా వ్యవస్థను దాటుకొని వెళ్లి ప్రియాంకను కలవడంతో కలకలం రేగింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రియాంక గాంధీతో ఫొటో దిగేందుకు వచ్చిన వ్యక్తులు యూపీకి చెందినవారిగా గుర్తించారు. భద్రతా వైఫల్యం కారణంగానే ఇది జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఐతే ఈ విషయం తమ దృష్టికి రాలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

కాగా, 1984లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని సొంత బాడీ గార్డ్స్ హత్య చేసిన తర్వాత.. 1985లో కేంద్ర ప్రభుత్వం SPG ని ఏర్పాటు చేసింది. SPGలో ప్రస్తుతం 3వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు. మన దేశంలో మొన్నటి వరకు నలుగురికి మాత్రమే SPG సెక్యూరిటీ ఉంది. వారిలో ఒకరు ప్రధాన మంత్రి మోదీ కాగా.. మిగిలిన ముగ్గురు గాంధీ కుటుంబ సభ్యులు. ఎస్పీజీ భద్రతపై సమయానుగుణంగా కేంద్రం సమీక్ష నిర్వహిస్తుంది. అవసరమైనప్పుడు ఎస్పీజీ భద్రతను తొలగిస్తుంది. ఈ క్రమంలో గాంధీ ఫ్యామిలీకి ఎలాంటి ప్రత్యక్ష ముప్పు లేనందున వారికి నవంబరు 4న ఎస్పీజీ తొలగించింది కేంద్రం.
Published by: Shiva Kumar Addula
First published: December 2, 2019, 7:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading