• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • PRIYANKA GANDHI RIDES SAREETWITTER TRAIN WITH PHOTO FROM HER WEDDING SB

పగడపు రంగు చీరలో ప్రియాంక... పెళ్లినాటి ఫోటో వైరల్

పగడపు రంగు చీరలో ప్రియాంక... పెళ్లినాటి ఫోటో వైరల్

చీరకట్టులో ప్రియాంక గాంధీ

22 ఏళ్ల క్రితం నా పెళ్లి రోజున ఉదయం పూజా సమయంలో అంటూ తన పెళ్లిరోజు చీరతో తీసుకున్న ఫోటోను ప్రియాంక పోస్టు చేశారు.

  • Share this:
    రాహుల్ గాంధీ సోదరి, కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ తన పెళ్లి నాటి ఫోటోను పోస్టు చేశారు. బుధవారం ఉదయం ఆమె తన ట్విట్టర్‌లో పగడపు వర్ణంలో కల చీర కట్టుతో ఉన్న పాత ఫోటోను ఆమె పోస్టు చేశారు. 22 ఏళ్ల క్రితం నా పెళ్లి రోజున ఉదయం పూజా సమయంలో అంటూ తన పెళ్లిరోజు చీరతో తీసుకున్న ఫోటోను పెట్టారు. #SareeTwitter అనే హ్యాష్ ట్యాగ్‌ను ఆమె తన పోస్టకు ట్యాగ్ చేశారు. ప్రియాంక గాంధీ 1997 ఫిబ్రవరి 18న ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను వివాహం చేసుకున్నారు. గత కొన్నిరోజులుగా ట్విట్టర్‌లో #SareeTwitter అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. చాలామంది సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు, ప్రముఖులు చీరల్లో ఫోటోల్ని షేర్ చేస్తున్నారు. మగవారు అయితే.. తమ ఫ్యామిలీలో ఆడవాళ్లు చీరకట్టులో ఉన్న ఫోటోల్ని ట్విట్టర్‌లో పెడుతూ #SareeTwitter హ్యాష్ ట్యాగ్ జత చేస్తున్నారు.

    ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు నగ్మా కూడా చీరకట్టులో ఉన్న ఫోటోను పెట్టారు. చీర అనేది మన సంస్కృతి, సంప్రదాయాలకు వివరిస్తుందన్నారామె. చీర మా సెక్సీయెస్ట్ కాస్ట్యూమ్ అని కూడా అన్నారామె. చీరకట్టులోమహిళలు గౌరవంగా, సొగసైనదిగా, అందంగా, మనోహరంగా కనిపిస్తారన్నారు. ఆడవారు చీరలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారన్నారు నగ్మా. కాంగ్రెస్ నాయకుడు, అస్సాం ఎంపీ గౌరవ్ గొగోయ్ తన భార్య ఎలిజబెత్ కోల్బర్న్ గొగోయ్ యొక్క ఫోటోను చీరలో పోస్టు చేశారు. దీనికి ఆయన ఓ చిలిపి ప్రశ్నను కూడా పోస్టు చేశారు. "భర్తలు # సారీ ట్విట్టర్‌లో వెళ్ళగలరా?"

    ఇక వీరితో పాటు.. చాలామంది విదేశీయులు కూడా చీరకట్టులో ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. దీంతో #SareeTwitter ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతోంది. వీరితో పాటు భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చీర ధరించిన ప్రజలు, దౌత్యవేత్తల ఫోటోలను పోస్ట్ చేసింది.



    Published by:Sulthana Begum Shaik
    First published:

    అగ్ర కథనాలు