లక్నోలో ప్రియాంక గాంధీ... రాహుల్‌తో కలిసి రోడ్‌షో

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ.. పూర్తిస్థాయిలో ఎన్నికల కదనరంగంలోకి అడుగుపెట్టారు. పార్టీ అధ్యక్షుడు, సోదరుడు రాహుల్‌ గాంధీ కలిసి లక్నో చేరుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి భారీ రోడ్‌షో లో పాల్గొన్నారు.

news18-telugu
Updated: February 11, 2019, 3:36 PM IST
లక్నోలో ప్రియాంక గాంధీ... రాహుల్‌తో కలిసి రోడ్‌షో
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
  • Share this:
ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం.. తన అమ్ముల పొదలోని బ్రహ్మాస్త్రం ప్రియాంక గాంధీని ప్రత్యర్థులపైకి వదిలింది. ఇన్నాళ్లూ పార్టీకి బయట నుంచి మద్దతు తెలిపిన ప్రియాంక గాంధీకి జనరల్ సెక్రెటరీగా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. దీంతోయూపీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో పార్టీ జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి లక్నోలో అడుగుపెట్టారు ప్రియాంక గాంధీ. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించే పనిలో తొలి అడుగు వేశారు. పార్టీ సారథి, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి లక్నోకు వచ్చిన ప్రియాంక గాంధీకి.. పార్టీ శ్రేణులు గ్రాండ్‌ వెల్‌కమ్ చెప్పాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్‌షోలో రాహుల్ గాంధీతో కలిసి ఆమె పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు అభివాదం చేస్తూ ఆమె ముందుకు సాగారు. సుమారు 15 కిలోమీటర్ల పొడవునా ఆమె రోడ్‌షో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా తరలివచ్చారు.

ప్రియాంక గాంధీ ఎంట్రీ ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణలను  పూర్తిగా మార్చివేసింది. ఇప్పటికే దశాబ్దాలుగా ఓడిపోతూ నిరుత్సాహంలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రియాంక రాకతో కొత్త ఉత్సాహం నింపుకొన్నాయి. ఇక, ప్రియాంక గాంధీ 4 రోజుల పాటు యూపీ రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో పర్యటించనున్నారు. ఇందిర హయాం తర్వాత గాంధీ కుటుంబసభ్యులెవ్వరూ యూపీలో వరుసగా ఇన్నిరోజుల పాటు పర్యటించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రియంక పర్యటన రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. యూపీ కాంగ్రెస్‌లో కొత్త జోష్ నింపుతోంది.

లక్నోలో రోడ్ షో నిర్వహించిన ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ప్రియాంక, రాహుల్ గాంధీలను చూసేందుకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులుగ్యాలరీ: లక్నోలో రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక గాంధీ మెగా రోడ్ షో..

First published: February 11, 2019, 1:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading