Home /News /politics /

PRIYANKA GANDHI PLAYS WITH SNAKES DURING ELECTION CAMPAIGN IN RAEBARELI MS

ప్రియాంక గాంధీని చూశారా.. పాముతో ఎలా ఆటలాడుతుందో..

పాముతో ప్రియాంక గాంధీ

పాముతో ప్రియాంక గాంధీ

ప్రియాంక ఇలా పాములతో ఆడటంపై పెటా (జంతు సంరక్షణ సంస్థ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో పాములను ఉపయోగించరాదన్న ఎన్నికల కమిషన్ నిబంధనలకు ఇది విరుద్దం అని తెలిపింది. ఇలా చేయడం వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడమే అని పేర్కొంది.

ఇంకా చదవండి ...
    తూర్పు యూపీ కాంగ్రెస్ ఇన్‌చార్జి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని వర్గాల వారితో మమేకమవుతూ వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజాగా ఓ పాములు ఆడించే వ్యక్తితో ఆమె మాట్లాడారు. వారి జీవనంపై.. ఆర్థిక పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక స్వయంగా పామును పట్టుకుని బుట్టలో పెట్టడం గమనార్హం. ఆ సమయంలో పాములు ఆడించే వ్యక్తి ఆమెను వారించగా.. 'ఏమీ కాదు.. ఇది నన్నేమీ చేయదు.. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు' అని ప్రియాంక బదులిచ్చారు. గురువారం రాయ్‌బరేలీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

    ప్రియాంక ఇలా పాములతో ఆడటంపై పెటా (జంతు సంరక్షణ సంస్థ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో పాములను ఉపయోగించరాదన్న ఎన్నికల కమిషన్ నిబంధనలకు ఇది విరుద్దం అని తెలిపింది. ఇలా చేయడం వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడమే అని పేర్కొంది. పాములు ఆడించే ఆ వ్యక్తితో ప్రియాంక కొద్దిసేపు పిచ్చాపాటిగా మాట్లాడారు. వెనుక నుంచి ఓ వ్యక్తి.. ఆ పాములను లోపల పెట్టడంటూ అతనికి సూచించగా.. 'ఎందుకు భయమవుతోందా?' అంటూ ప్రియాంక సరదాగా అన్నారు. ఇక కాంగ్రెస్ బీజేపీకి మేలు చేస్తోందన్న విమర్శలను ప్రియాంక తిప్పికొట్టారు. భావజాలం పరంగా కాంగ్రెస్, బీజేపీలు విజాతి ధ్రువాలు అని చెప్పారు. తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీయే కాబట్టి.. ఆ పార్టీపై పోరాడుతున్నామని చెప్పారు. బీజేపీకి మేలు చేసేలా ఎన్నడూ చేయలేదని, తమ పార్టీ తరుపున బలమైన అభ్యర్థులే పోటీ చేస్తున్నారని తెలిపారు.

    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Congress, Lok Sabha Elections 2019, Priyanka Gandhi, Uttar Pradesh Lok Sabha Elections 2019

    తదుపరి వార్తలు