యూపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ప్రియాంక గాంధీ... టార్గెట్ 2022 ?

జాతీయస్థాయిలో కాంగ్రెస్ తరపున ముఖ్యమైన బాధ్యతలు తీసుకోవడానికి ముందు ఉత్తరప్రదేశ్‌లో పార్టీని పటిష్టం చేయాలని ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: September 3, 2019, 5:13 PM IST
యూపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ప్రియాంక గాంధీ... టార్గెట్ 2022 ?
ప్రియాంక గాంధీ(ఫైల్ ఫోెటో)
  • Share this:
కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. అయితే జాతీయస్థాయిలో కాంగ్రెస్ తరపున ముఖ్యమైన బాధ్యతలు తీసుకోవడానికి ముందు ఉత్తరప్రదేశ్‌లో పార్టీని పటిష్టం చేయాలని ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఆమెను యూపీకి పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ వ్యవహారాలను చూస్తున్న ప్రియాంక గాంధీ... త్వరలోనే ఉత్తరప్రదేశ్ పార్టీ బాధ్యతలను స్వీకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

ఇప్పటికే యూపీలోని అన్ని లోక్ సభ నియోజకవర్గాల ఎంపీ అభ్యర్థులతో పాటు జిల్లా పార్టీ నాయకులతో క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహించిన ప్రియాంక గాంధీ... 2022లో కాంగ్రెస్‌ను ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్‌గా పెట్టుకున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీని మళ్లీ పటిష్టం చేసేందుకు ఇప్పటికే ఓ ప్లాన్‌ను కూడా ప్రియాంక సిద్ధం చేశారని తెలుస్తోంది. గత లోక్ సభ ఎన్నికలకు ముందు తూర్పు యూపీ పార్టీ బాధ్యతలను స్వీకరించిన ప్రియాంక... ఆ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేదు.


First published: September 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు