PRIYANKA GANDHI JUMPS OVER BARRICADE TO MEET SUPPORTERS MS
బారికేడ్ పైనుంచి జంప్ చేసిన ప్రియాంక గాంధీ..
ప్రియాంక గాంధీ (Image: ANI/Twitter)
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా.. పాములు పట్టే వ్యక్తితో ప్రియాంక ముచ్చటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఓ పామును స్వయంగా పట్టుకుని ఆమె ఆటలాడటం హాట్ టాపిక్‌గా మారింది.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు. తూర్పు యూపీ కాంగ్రెస్ ఇన్చార్జి హోదాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అన్ని వర్గాలతో మమేకమవుతూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఎంతలా అంటే.. జనంలో ఉన్నప్పుడు తానో స్టార్ పొలిటీషియన్‌లా కాకుండా సామాన్యురాలి గానే వ్యవహరిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ప్రియాంక.. జనంతో మాట్లాడేందుకు బారికేడ్ పైనుంచి జంప్ చేసి మరీ వెళ్లడం నిదర్శనం.
బహిరంగ సభ వేదిక ముందు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో.. కార్యకర్తలు, అభిమానులతో నేరుగా మాట్లాడేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో సభ అనంతరం ప్రియాంక బారికేడ్ పైనుంచి జంప్ చేసి జనం వద్దకు వెళ్లారు. వారితో మాట్లాడి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, తద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని వారికి భరోసా ఇచ్చారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా.. పాములు పట్టే వ్యక్తితో ప్రియాంక ముచ్చటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఓ పామును స్వయంగా పట్టుకుని ఆమె ఆటలాడటం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా బారికేడ్ పైనుంచి దూకి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. మొత్తం మీద ఎన్నికల ప్రచారంలో ప్రియాంక వ్యవహార శైలి సామాన్యులను ఆకట్టుకునేలా సాగుతుందంటున్నారు.
#WATCH Priyanka Gandhi Vadra, Congress General Secretary for Uttar Pradesh (East) hops over a barricade to meet supporters during a public meeting in Ratlam, Madhya Pradesh. (13.5.19) pic.twitter.com/9pPnxOJn1k
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.