ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు.. ఆజాద్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లో భారీ మార్పులు

కాంగ్రెస్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించిన అధినాయకత్వం.. ఆజాద్‌కు మరో షాక్ ఇచ్చింది.

news18-telugu
Updated: September 11, 2020, 9:45 PM IST
ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు.. ఆజాద్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లో భారీ మార్పులు
ప్రియాంక గాంధీ, ఆజాద్(ఫైల్ ఫోటో)
  • Share this:
కాంగ్రెస్ జాతీయ నాయకత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ పరంగా పలు మార్పులు చేసింది. పలు బాధ్యతల నుంచి కొందరు సీనియర్ నేతలకు ఉద్వాసన పలికింది. పార్టీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి గులాం నబీ ఆజాద్‌ను తప్పించారు. ఆజాద్‌తో పాటు అంబికా సోనీ, మోతీలాల్ వోరా, మల్జికార్జున ఖర్గే వంటి నేతలను కూడా తొలగించారు. ఇక గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీకి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆమెను పార్టీ జనరల్ సెక్రటరీల్లో ఒకరిగా నియమించిన అధినాయకత్వం.. ఉత్తరప్రదేశ్‌ ఇంఛార్జ్ బాధ్యతలను ఆమెకు అప్పగించింది. పార్టీకి సంబంధించి పలు రాష్ట్రాల ఇంఛార్జ్ బాధ్యతల నుంచి ఇటీవల అధినాయకత్వంపై తిరుగుబాటు చేసిన నేతలను హైకమాండ్ తప్పించింది.అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మాత్రం ఆజాద్, ఆనంద్ శర్మలకు చోటు లభించింది. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ ఇంఛార్జ్‌గా జితిన్ ప్రసాద్‌ను నియమించిన కాంగ్రెస్ అధిష్టానం.. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీలో మధుసూదన్ మిస్త్రీ, రాజేష్ మిశ్రా, కృష్ణ బైరే గౌడ, ఎస్ జ్యోతిమని, అవిందర్ సింగ్ లవ్లీలను నియమించింది. కర్ణాటక కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా రణ్‌దీప్ సుర్జేవాలా, అస్సాం జనరల్ సెక్రటరీగా జితేంద్ర సింగ్, రాజస్థాన్ జనరల్ సెక్రటరీగా అజయ్ మాకెన్‌లను నియమించింది.
Published by: Kishore Akkaladevi
First published: September 11, 2020, 9:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading