నన్ను మెడపట్టి తోసేశారు.. పోలీసులపై ప్రియాంక గాంధీ ఆరోపణలు..

యూపీ పర్యటనలో ఉన్న తనను పోలీసులు అడ్డుకున్నారని, మెడ పట్టి తోసేశారని ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు.

news18-telugu
Updated: December 28, 2019, 10:33 PM IST
నన్ను మెడపట్టి తోసేశారు.. పోలీసులపై ప్రియాంక గాంధీ ఆరోపణలు..
ప్రియాంకా గాంధీ వాద్రా
  • Share this:
ఉత్తరప్రదేశ్ పోలీసులపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా లక్నోలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రియాంక గాంధీ హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం తర్వాత సీఏఏ, ఎన్ఆర్‌సీలపై ఆందోళనలో గాయపడ్డవారిని పరామర్శించడానికి ప్రియాంక బయలుదేరారు. ఆమె పర్యటించడానికి వీళ్లేదంటూ అక్కడి పోలీసులు రోడ్డుపైనే అ‍డ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు తనపై చేయి చేసుకున్నారని ప్రియాంక ఆరోపించారు. పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కొందరూ పోలీసులు తన మెడ పట్టి పక్కకు నెట్టేశారని. ప్రతిఘటించిన తనమీద దాడి కూడా చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రియాంక గాంధీ వాద్రా ‘కాంగ్రెస్ కార్యకర్తలను కలిసి కారులో వస్తున్నా. నా కారును ఆపేశారు. దీంతో ద్విచక్రవాహనంపై వస్తున్నా. దారిలో పోలీసుల వాహనం ఒకటి మా వెనక వచ్చింది. మీరు అక్కడికి వెళ్లడానికి వీల్లేదని అడ్డుకున్నారు. ఎందుకు వెళ్లకూడదని నేను ప్రశ్నించా. దీంతో వారు నాపై దౌర్జన్యం చేసి తోసేశారు.’ అని ప్రియాంక గాంధీ చెప్పారు.First published: December 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు