విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. కాశీయాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా... బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది . జిల్లాలో గరుగుబిల్లిమండలం ఖడ్గవలస గ్రామం వద్ద గౌరిశంకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి నాగావళి కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 20మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం పార్వతీపురం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారు కన్నెపుదొరవాసులుగా తెలుస్తోంది.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.