హోమ్ /వార్తలు /National రాజకీయం /

Modi America Tour: మళ్లీ వీదేశాల టూర్ లో ప్రధాని.. నెలాఖరున అమెరికా అధ్యక్షుడి బైడెన్ తో భేటీ..!

Modi America Tour: మళ్లీ వీదేశాల టూర్ లో ప్రధాని.. నెలాఖరున అమెరికా అధ్యక్షుడి బైడెన్ తో భేటీ..!

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

PM Modi: కరోనా పరిస్థితుల నేపథ్యంలో వివిధ దేశాల అద్యక్షులు, ప్రధానులు ఇతర దేశాలు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. కానీ ఇలాంటి నేపథ్యంలో ప్రధాని మోదీ-జో బైడెన్ నేరుగా భేటీ అవ్వనున్నారు. ఆఫ్గన్ పరిస్థితిపై ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...

PM Modi TOur: ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొంత కాలానికే నరేంద్ర మోదీ (Narendra Modi) వరుస విదేశీ పర్యటనలు చేపట్టారు. భారత్ లో కంటే విదేశాల్లోనే ఎక్కువగా ఉంటున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే తరువాత కరోనా (Corona).. లాక్ డౌన్ (Lockdown) కారణాలతో కేవలం వర్చువల్ మీటింగ్ లకే ఆయన పరిమితం అయ్యారు. అయితే ఇప్పుడు కరోనా పరిస్థితుల నుంచి కాస్త బయట పడుతుండడంతో మళ్లీ విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  (ప్రధాని నరేంద్ర మోదీ) త్వరలో అమెరికాలో పర్యటించబోతున్నారు. అమెరికా దేశాధ్యక్షుడు జో బైడెన్‌ (Jo Biden)తో భేటీ కాబోతున్నారు. ఈ నెలాఖరులో యుఎస్‌(USA) లో ప్రధాని మోదీ పర్యటించే అవకాశం ఉంది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తొలిసారి అమెరికా వెళ్తున్నారు. మోడీ, బైడెన్ సమావేశం తేదీలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయ్. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ నెల 22-27 మధ్యలో ఇరువురు నేతలు సమావేశం కానున్నారు. ప్రధాని మోదీ, జో బైడెన్‌లు…వర్చువల్ విధానంలో ఇప్పటి మూడుసార్లు చర్చలు జరిపారు. మార్చిలో క్వాడ్ సమ్మిట్ గురించి, ఏప్రిల్‌లో వాతావరణ మార్పులపై, జూన్‌లో జీ-7 సదస్సుపై చర్చించారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌ (Afghanistan) లో ఉద్రిక్త పరిస్థితుల కొనసాగుతున్న సమయంలో.. మోదీ, బైడెన్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా పర్యటన ఖరారైతే.. మోదీ పలువురు నేతలను కలిసే అవకాశాలు ఉన్నాయి. డోనాల్డ్ ట్రంప్‌ హయాంలో.. 2019 సెప్టెంబరులో అమెరికాలో పర్యటించారు ప్రధాని. సెప్టెంబరు 22న హౌస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరిగ్గా రెండేళ్ల తర్వా త.. మరోసారి యుఎస్‌ టూర్‌కు వెళ్లనున్నారు మోదీ.

ఈ ఏడాది జనవరిలో దేశంలో జో బైడెన్‌ పరిపాలన పగ్గాలు చేపట్టిన తరువాత అమెరికాలో మన దేశ ప్రధాని చేస్తున్న మొదటి పర్యటన ఇది. ఈ పర్యటనపై అధికారిక ధృవీకరణ లేకపోయినప్పటికీ.. ఏర్పాట్లు జరుగుతున్నట్టు ప్రభుత్వం నుంచి విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఈ నెలాఖరులోనే ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఉండవచ్చని తెలుస్తోందని జాతీయ మీడియా చెబుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రధాని అమెరికా పర్యటన కోసం సెప్టెంబర్ 23, 24 తేదీలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: తాలిబన్లతో చేతులు కలిపిన అల్ ఖైదా.. పంజ్‌షీర్‌‌ ఆక్రమణ ప్రధాన లక్ష్యం.. తరువాత టార్గెట్ కాశ్మీర్ అంటూ ప్రచారం

ప్రస్తుతం ప్రధాని మోదీ వాషింగ్టన్, న్యూయార్క్ వెళ్లనున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం మారిన నేపథ్యంలో మోదీ అమెరికా వెళ్ళవచ్చని జరుగుతున్న ప్రచారం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ లో అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలపై తాలిబాన్లు నియంత్రణ సాధించారు. రెండు దశాబ్దాల తర్వాత తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నేపధ్యంలో ప్రధాని అమెరికాకు వెళ్ళవచ్చనే వార్తలపై విశ్లేషకులు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇదీ చదవండి: బరువు తగ్గాలి అనుకుంటున్నారా..? ఆరోగ్యకరమైన ఈ ఆరింటిని ఆహారంలో చేర్చండి..

న్యూయార్క్‌లో, ప్రధాన మంత్రి వార్షిక ఉన్నత స్థాయి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే వాషింగ్టన్‌లో, ప్రధానమంత్రి పర్యటన జరిగిన సమయంలోనే క్వాడ్ నాయకుల శిఖరాగ్ర సమావేశం జరుగుతుందని భావిస్తున్నారు. అమెరికాలో ఉన్న విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా విలేకరులతో మాట్లాడుతూ.. క్వాడ్ సమావేశం జరిగే అవకాశం ఉందని సూచించారు. ఈ విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పకపోయినా.. తాను ఈ విషయంపై వ్యాఖ్యానిన్చాలేననీ, కానీ శిఖరాగ్ర సమావేశం జరిగితే, ప్రధాని మోడీ తానూ ఆ సమావేశానికి హాజరు కావాలని భావిస్తున్నట్టు ఇప్పటికే చెప్పారు.

First published:

Tags: America, Pm modi, PM Narendra Modi, USA

ఉత్తమ కథలు