Narendra Modi: మోదీ ప్రజా ప్రస్థానానికి 20 ఏళ్లు.. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు.. ఈ రోజంతా భారీగా ప్లాన్

ప్రతీకాత్మక చిత్రం

Narendra Modi: ప్రపంచ వ్యాప్తంగా తనకంటే సపరేట్ క్రేజ్ తెచ్చుకున్న నాయకుడు నరేంద్ర మోదీ.. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రజా జీవితం మొదలెట్టి 20 ఏళ్లు నేటికి పూర్తైంది. ఇప్పుడు ప్రధానిగా కొనసాగుతున్నారు. దీంతో నేడు భారీ కార్యక్రమాలకు ప్లాన్ చేసింది బీజేపీ

 • Share this:
  M Narendra Modi completes 2 decades: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రజా సేవకు పున:రంకితమై నేటికి రెండు దశాబ్ధాలు పూర్తయింది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి (Gujarat chief Minster) గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇరవై యేళ్లుగా నిరంతర ప్రజాసేవ చేస్తున్నారు మోదీ. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి.. ప్రధానమంత్రిగా మోదీ 20 సంవత్సరాల ప్రజా జీవితాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన పుట్టిన రోజు సెప్టెంబర్ 17 నుంచి నేటి వరకు 20 రోజులపాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ (BJP) తరుఫున భారీ కార్యక్రమాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. నదులను శుభ్రపరచడం, వ్యాక్సినేషన్, పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న కీలక నిర్ణయాలు.. చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించనున్నారు. రోజంతా విరామం లేకుండా మోదీ పేరు మారుమోగేలా అన్ని రాష్ట్రాల్లో కార్యక్రమాలకు ప్లాన్ సిద్ధం చేశారు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సందడి కనిపించనుంది..

  ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2001లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి 2014వరకు కొనసాగారు. తరువాత 2014 నుంచి రెండోసారి ప్రధాన మంత్రిగా మోదీ సేవలందిస్తున్నారు. అయితే.. మోదీ సరిగ్గా 2001 అక్టోబర్‌ 7న ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటికి అక్కడ విపత్తు సహాయ కార్యక్రమాల్లో అప్పటి సీఎం కేశూభాయ్‌ పటేల్‌, ఆయన ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దాని ఫలితంగా ఆయన్ను పదవి నుంచి తొలగించి నరేంద్రమోదీని పీఠంపై కూర్చోబెట్టింది బీజేపీ అధిష్టానం. ఇక 2002 ఫిబ్రవరిలో గుజరాత్‌లో అల్లర్లు చెలరేగిన నాటికి మోదీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఐదు నెలలైంది. ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. చాలా ఒత్తిళ్లు కూడా వచ్చాయి. కానీ మోదీనే అధిష్టానం కొనసాగించింది. డిసెంబరులో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 182 సీట్లలో 127 సీట్లను గెలుచుకోవడం ద్వారా బీజేపీ అత్యధిక మెజారిటీ సాధించింది. మరోసారి మోదీ ముఖ్యమంత్రి అయ్యారు. మోదీ నాయకత్వంలో 2007, 2012 ఎన్నికలలో కూడా గుజరాత్‌లో బీజేపీ సులభంగా అధికారాన్ని నిలుపుకుంది. ఆ రాష్ట్రానికి ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు ఆయనకు దక్కగా, మోదీ నాయకత్వంలో గుజరాత్ మోడల్‌కు మంచి పేరు వచ్చింది.

  2013లో మోదీని బీజేపీ తన ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరమే ఆయన గుజరాత్ నుంచి దిల్లీ వచ్చారు. ఆయన్ను ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించుకుని సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 2019లో కూడా మోదీ విజయ యాత్ర కొనసాగింది. వరుసగా రెండోసారి ప్రధాని అయ్యారు.

  ఇదీ చదవండి: తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ప్రపంచంలో తొలి మలేరియా వ్యాక్సిన్.. పిల్లల కోసం WHO ఆమోదం

  ఇప్పటి వరకూ ఆయన నిరంతరం 20 ఏళ్లపాటు ప్రజా సేవలోనే ఉన్నారు. దీనిలో భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు బీజీపీ సన్నాహాలు చేసింది. సేవా ఔర్ సమర్పణ్ అభియాన్ పేరుతో బీజేపీ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలు.. తమతమ నియోజకవర్గాలలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

  ఇదీ చదవండి: నేటినుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. తొలి రోజు శ్రీస్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో దర్శనం.. ప్రత్యేకత ఏంటంటే..?

  నరేంద్రమోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి.. ఆయన పుట్టినరోజు సందర్భంగా బీజేపీ సేవా దివస్‌గా వారంపాటు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. అయితే.. ఈ సారి 20 రోజుల పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది. ఎందుకంటే.. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి.. ప్రధానమంత్రిగా మోదీ 20 సంవత్సరాల ప్రజా జీవితాన్ని పుర్తిచేసుకున్న సందర్భంగా 20 రోజులపాటు ఈ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు చేశారు.
  Published by:Nagesh Paina
  First published: