ఫ్రాన్స్‌లో ప్రధాని పర్యటన... హిందీలో ప్రసంగించిన మోదీ

భారత్‌ను అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చానని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారమే.. భారత్‌ గురించి ప్రపంచం మొత్తం చర్చించుకునేలా అభివృద్ధిలో పయనిస్తుందన్నారుమోదీ.

news18-telugu
Updated: August 23, 2019, 3:47 PM IST
ఫ్రాన్స్‌లో ప్రధాని పర్యటన... హిందీలో ప్రసంగించిన మోదీ
ఫ్రాన్స్‌లో మోదీ ప్రసంగం
  • Share this:
విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఫ్రాన్స్‌లో కొనసాగుతుంది. ఈ సందర్బంగా అక్కడున్న భారతీయలతో యునెస్కో హెడ్ క్వార్టర్స్‌లో సమావేశమైన ఆయన...హిందీలో ప్రసంగించారు. భారత్-ఫ్రాన్స్ మధ్య కాలానికి అతీతంగా స్నేహబంధం నిలిచిందన్నారు. రెండు దేశాలు పరస్పరం అభివృద్ధిని కోరుకుంటున్నాయన్నారు ప్రధాని. తనను మరోసారి ఫ్రాన్స్‌కు ఆహ్వానించిన అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీ అందర్ని కలవడం నా అదృష్టమన్నారు మోదీ. నాలుగేళ్ల క్రితం ఫ్రాన్స్ వచ్చినప్పుడు అక్కడ భారత ప్రజలకు ఇచ్చిన ఓ హామీని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. సాధారణంగా రాజకీయ నేతలకు ఇచ్చిన హామీ మరిచిపోయే అలవాటు ఉంటుందన్నారు. కానీ తాను అలాంటి పొలిటికల్ లీడర్ కాదన్నారు ప్రధాని. భారత్‌ను అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చానని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారమే.. భారత్‌ గురించి ప్రపంచం మొత్తం చర్చించుకునేలా అభివృద్ధిలో పయనిస్తుందన్నారుమోదీ. బీజేపీకి మరోసారి ప్రజలు పట్టం కట్టారన్నారు. దేశాన్ని పాలించేందుకు మరోసారి అవకావమిచ్చామన్నారు. కేవలం భారత్‌ను పాలించడమే కాదు... కొత్త భారతాన్ని నియమించాల్సిన అవసరం కూడా తమపై ఉందన్నారు. మోదీ ప్రసంగిస్తున్న వేళ అక్కడ హాల్‌లో మోదీ మోదీ నినాదాలతో ఆయన అభిమానులంతో హోరెత్తించారు.

విదేశీ పర్యటన నిమిత్తం గురువారమే ఫ్రాన్స్‌కు చేరుకున్నారు ప్రధాని. ఈ సందర్భంగా ఆయనకు ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి జీనివ్స్‌ లీ డ్రియన్‌ ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. మూడుదేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌ చేరుకున్న మోదీ, శుక్రవారం యూఏఈకి వెళ్లనున్నారు. అనంతరం బహ్రెయిన్‌‌లో పర్యటించి ఆ దేశపు రాజు షేక్‌ హమీద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫాతో సమావేశమై చర్చలు జరుపుతారు. చివరగా ఆదివారం ఫ్రాన్స్‌కు తిరిగొచ్చి జీ7 సదస్సులో పాల్గొంటారు.


First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading