Home /News /politics /

Gandhi 150th Birth Anniversary : గాంధీపై న్యూయార్క్ టైమ్స్‌కు మోదీ ప్రత్యేక కథనం

Gandhi 150th Birth Anniversary : గాంధీపై న్యూయార్క్ టైమ్స్‌కు మోదీ ప్రత్యేక కథనం

మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తున్న ప్రధాని మోదీ

మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తున్న ప్రధాని మోదీ

Modi on Mahatma Gandhi : 1925లో గాంధీ జాతీయవాదం గురించి చెప్పారని మోదీ గుర్తుచేశారు. జాతీయవాదిగా లేకుండా అంతర్జాతీయవాదిగా ఉండటం అసాధ్యం అని గాంధీజీ చెప్పినట్టుగా పేర్కొన్నారు. జాతీయవాదం వాస్తవరూపం దాల్చినప్పుడే అంతర్జాతీయవాదం కూడా సాధ్యమవుతుందన్నారు.

ఇంకా చదవండి ...
    జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ 'న్యూయార్క్ టైమ్స్'కు 'వై ఇండియా అండ్ వరల్డ్' నీడ్ గాంధీ పేరుతో ప్రత్యేక కథనం రాశారు. గాంధీ జీవితంలోని కీలక ఘట్టాలు, ప్రపంచ దేశాలకు ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచిన తీరును ఆ కథనంలో వివరించారు. భావి తరాలకు గాంధీ సిద్ధాంతాలను అందించేందుకు ఐన్‌స్టీన్ ఛాలెంజ్‌ను ప్రతిపాదిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం విజ్ఞానవంతులు, పారిశ్రామిక వేత్తలు కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలని సూచించారు ప్రధాని.

    పౌరహక్కుల ఉద్యమ కారుడు మార్టిన్ లూథర్ కింగ్ 1952లో భారత పర్యటనకు వచ్చినప్పుడు చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తుచేశారు మోదీ. 'వేరే దేశాలకు వెళ్లినప్పుడు నేనో టూరిస్ట్‌గా వెళ్తాను. కానీ భారత పర్యటనకు వెళ్లినప్పుడు మాత్రం ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే యాత్రికుడిలా వెళ్తాను' అని మార్టిన్ చెప్పిన మాటలను కథనంలో ప్రస్తావించారు.సామాజిక పురోగతి కోసం అహింసా మార్గాన్ని అనుసరించిన భారత్ అంటే మార్టిన్‌కు ఎనలేని గౌరవం అని చెప్పారు.

    'ఘనా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి ప్రధాని మహాత్మా గాంధీ గురించి గుర్తుచేసుకున్నారు. గాంధీ పుస్తకాలను తాను చదివినట్టు చెప్పారు. దక్షిణాఫ్రికాలో ఆయన్ను రైల్లో ఎక్కకుండా అవమానించిన ఘటనను గుర్తుచేసుకున్నారు.' అని మార్టిన్ చెప్పిన మాటలను నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు.నెల్సన్ మండేలా సైతం గాంధీని 'పవిత్ర యోధుడిగా' పేర్కొన్నారని మోదీ గుర్తుచేశారు. గాంధీ అనుసరించిన సహాయ నిరాకరణ,అహింసావాదం వంటి పద్దతులు ప్రపంచవ్యాప్తంగా వలస వ్యతిరేక ఉద్యమాలకు,జాత్యహంకార వ్యతిరేక ఉద్యమాలకు దోహదపడ్డాయని మండేలా పేర్కొన్నట్టు తెలిపారు.1925లో గాంధీ జాతీయవాదం గురించి చెప్పారని మోదీ గుర్తుచేశారు. జాతీయవాదిగా లేకుండా అంతర్జాతీయవాదిగా ఉండటం అసాధ్యం అని గాంధీజీ చెప్పినట్టుగా పేర్కొన్నారు. జాతీయవాదం వాస్తవరూపం దాల్చినప్పుడే అంతర్జాతీయవాదం కూడా సాధ్యమవుతుందన్నారు.
    First published:

    Tags: Mahatma Gandhi, Narendra modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు