ఐక్యరాజ్యసమితి (United nations) 76వ జనరల్ అసెంబ్లీ (general assembly)లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత ప్రజాస్వామ్యంపై ప్రశంసలు కురింపించారు. భారత్ (India)లో ప్రజాస్వామ్యానికి చాలా విలువ ఉందని వ్యాఖ్యానించారు. డజన్ల కొద్ది భాషలు, వందలాది మాండలికాలు, విభిన్న జీవనశైలి, వంటకాలు తదితరాలు ప్రజాస్వామ్యానికి భారత్ ఉత్తమ ఉదాహరణ అని మోదీ అన్నారు. ఓ సాధారణ ఛాయ్‌వాలా దేశానికి ప్రధాని (Prime minister) స్థాయికి ఎదిగాడంటే దానికి ప్రజాస్వామ్యమే కారణమని తెలిపారు. భారత దేశ విద్యార్థులు తయారు చేసిన 75 ఉపగ్రహాలను (satellites) నింగి (Space)కి చేరనున్నాయని వెల్లడించారు. ఇంకా ఉగ్రవాదం (terrorism)పై కూడా మోదీ తనదైన శైలిలో పొరుగు దేశాలకు కౌంటరిచ్చారు. అయితే మోదీ తన ప్రసంగంలో టెక్నాలజీ (technology) తీరు తెన్నులపై ఎక్కువగా మాట్లాడారు. భారత్‌లో డిజిటల్ సంస్కరణలు చేపడుతున్నట్లు వివరించారు.
75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా..
జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ప్రపంచం ఓ మహమ్మారి వల్ల తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఇది గతంలో ఎన్నడూ చూడని విపత్తు. ఈ మహమ్మారిపై ఉమ్మడి పోరు చేసి విజయం సాధిద్దాం. వ్యాక్సిన్ (Vaccine) సరఫరాలో భారత్ ముందుంటుంది. ప్రపంచస్థాయి సంస్థలు భారత్‌లో వ్యాక్సిన్‌లు తయారు చేయాలి. భారత్‌కు స్వాతంత్య్రం (Independence) వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా విద్యార్థులు (students) తయారుచేసిన 75 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపబోతున్నాం. భారత్‌లో జరిగే పరిశోధనలు ప్రపంచానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి ” అన్నారు.
On 15 August this year, India entered the 75th year of independence. Our diversity is the identity of our strong democracy: PM Modi at UNGA pic.twitter.com/0sgpb3w6JH
— ANI (@ANI) September 25, 2021
అంతేకాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలmodi తన ప్రసంగంలో భారతదేశ అభివృద్ధి (India development)పై మాట్లాడారు. ఇండియా అభివృద్ధిలో దూసుకుపోతోందని.. ప్రపంచం ఎదుగుదలకు సహకరిస్తోందని వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. మా ప్రాధాన్యత ఏమిటంటే అభివృద్ధి అనేది అన్నింటినీ కలుపుకొని, సర్వవ్యాప్త, సార్వత్రికమైనదిగా అందరినీ పోషించేదిగా ఉండాలన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి డీఎన్‌ఏ (DNA) టీకాను భారతదేశం అభివృద్ధి చేసిందని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి తెలియజేయాలనుకుంటున్నానని మోదీ అన్నారు. ఇది 12 ఏళ్ల వయస్సు కంటే ఎక్కువ ఉన్న ఎవరికైనా ఇవ్వొచ్చని అన్నారు. ఒక MRNA టీకా అభివృద్ధి చివరి దశలో ఉందన్నారు.
భారతీయ శాస్త్రవేత్తలు (Indian Scientists) కూడా COVID19 కి నాజల్ వ్యాక్సిన్‌ను (ముక్కు ద్వారా ఇచ్చేది) అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. భారతదేశం ఎదిగినప్పుడు, ప్రపంచం ఎదుగుతుంది. భారతదేశం సంస్కరించబడిప్పుడు, ప్రపంచం (world) మారుతుందని అన్నారు. అభివృద్ధి అనేది అందరినీ కలుపుకొని, సార్వత్రికంగా, అందరినీ పోషించేదిగా ఉండాలని, అంత్యోదయ సూత్రంతోనే భారతదేశం నేడు సమగ్ర సమన్వయ అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతోందని అన్నారు.
ఇది కూడా చదవండి: ‘‘భారత్‌లో డిజిటల్ సంస్కరణలు చేపడుతున్నాం’’ ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోదీ ప్రసంగం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, ISRO, Narendra modi, PM Narendra Modi, Politics, Space, United Nations