Home /News /politics /

PRIME MINISTER NARENDRA MODI SAID AT THE UNITED NATIONS THAT WE ARE CARRYING OUT DIGITAL REFORMS IN INDIA PRV

PM Modi at UNGA: ‘‘భారత్​లో డిజిటల్​ సంస్కరణలు చేపడుతున్నాం’’ ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోదీ ప్రసంగం

పీఎం మోదీ ( Photo: ANI /Twitter)

పీఎం మోదీ ( Photo: ANI /Twitter)

ఒక టీ అమ్మిన వ్యక్తి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగిస్తున్నారని మోదీ అన్నారు. భారత ప్రజాస్వామ్య బలం ఒక యువ టీ విక్రేత 4 వ సారి ఐక్యరాజ్యసమితిను ఉద్దేశించి ప్రసంగించడమే" అని ఆయన తన ప్రారంభ వ్యాఖ్యలలో అన్నారు.  ఉగ్రవాదాన్ని రాజకీయాల కోసం వాడుకునే వారికి కూడా పెద్ద ప్రమాదం అన్నారు

ఇంకా చదవండి ...
    అమెరికాలోని న్యూయార్క్‌ (New york)లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 76 వ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi) ప్రసంగించారు.  టీ అమ్మిన వ్యక్తి ఐక్యరాజ్య సమితి (UN)లో ప్రసంగిస్తున్నారని మోదీ వెల్లడించారు.  ‘‘భారత ప్రజాస్వామ్య బలం ఒక  టీ విక్రేత నాలుగో  సారి ఐక్యరాజ్యసమితిను ఉద్దేశించి ప్రసంగించడమే" అని ఆయన తన ప్రారంభ వ్యాఖ్యలలో అన్నారు.  ఉగ్రవాదాన్ని రాజకీయాల కోసం వాడుకునే వారికి కూడా పెద్ద ప్రమాదం అన్నారు. డజన్ల కొద్ది భాషలు, వందలాది మాండలికాలు, విభిన్న జీవనశైలి, వంటకాలు తదితరాలు ప్రజాస్వామ్యానికి భారత్​ ఉత్తమ ఉదాహరణ అని మోదీ అన్నారు.

    భారత్​ అభివృద్ధితో ప్రపంచ వృద్ధిలోనూ వేగం..

    ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘  స్వాతంత్య్రం సాధించి భారత్​ 75 వసంతాల్లోకి అడుగుపెట్టింది. దేశంలో విభిన్నతే మా ప్రజాస్వామ్యానికి  బలం. ఈ శతాబ్ధంలోనే ఇది అత్యంత కఠిన సమయం. భారత్​లో జరిగే పరిశోధనలు ప్రపంచానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.  కరోనా సమయంలో 3 కోట్ల మందికి ఇళ్లు కట్టి ఇచ్చాం. కరోనా సమయంలో భారత్​ వ్యాక్సిన్​ హబ్ (Vaccine hub)​గా నిలిచింది. ముక్కు ద్వారా ఇచ్చే టీకాను త్వరలో అందుబాటులోకి  తెస్తాం. ఎంఆర్​ఎన్​ఏ టీకా చివరి దశలో ఉంది. డీఎన్​ఏ టీకాను తయారు చేసిన మొదటి దేశం భారత్​. భారత్​ అభివృద్ధితో ప్రపంచ వృద్ధిలోనూ వేగం పెరిగింది. దేశంలో డిజిటల్​ సంస్కరణలు చేపడుతున్నాం.  ఉగ్రవాదం ప్రపంచానికే ప్రమాదకరం. అప్ఘనిస్తాన్​లో మహిళలు, పిల్లలకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ” అన్నారు.



    కాగా, ప్రధానమంత్రికి తన హోటల్ వెలుపల అనేక మంది భారతీయులు (Indians) స్వాగతం పలికారు, వారు ప్రధానిని ఉత్సాహపరిచారు (Encouraged).  'వందేమాతరం'  'భారత్ మాతా కీ జై' అని నినాదాలు  (slogans)చేశారు. వైట్ హౌస్‌ (White House)లోని ఓవల్ కార్యాలయంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ (US President Joe Biden)తో తన మొదటి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించిన తరువాత మోదీ శుక్రవారం వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ (Newyork) వెళ్లారు . శుక్రవారం తన మొదటి  క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు.





    జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరుతుండగా, న్యూయార్క్ లోని  హోటల్ బయట గుమిగూడిన భారతీయులకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. అక్కడ నుంచి మోదీ ఇండియాకు తిరిగి రానున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: America, Narendra modi, New york, PM Narendra Modi, Politics, United Nations

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు