PRIME MINISTER NARENDRA MODI PLAYS THE DRUMS AT THE KASHI VISHWANAKH TEMPLE IN VARANASI SNR
Modi: మరోసారి డ్రమ్స్ వాయించిన ప్రధాని..వైరల్ అవుతున్న మోదీ వీడియో
Photo Credit: Twitter
Modi: ప్రధాని నరేంద్రమోదీ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో భక్తి పారవశ్యంతో ఊగిపోయారు. ఆలయం లోపల భక్తుడి చేతిలోంచి డ్రమ్ తీసుకొని కాసేపు వాయించారు. గతంలో కూడా ఢిల్లీలో కంజర వాయించారు. అంతకు ముందు గ్లాస్గో, టాంజానియాలో కూడా ఇలాగే డ్రమ్స్ వాయించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)కి భక్తి, భజనలంటే చెప్పలేని ఆసక్తి కనబరుస్తారు. దైవదర్శనానికి వెళ్లిన సమయంలో తన్మయత్వంలో మునిగిపోతారు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం శుక్రవారం వారణాసి(Varanasi)లో పర్యాటించారు. ఈసందర్భంగా ఆయన మరోసారి డ్రమ్స్ వాయించారు. కాశిలోని కాశీవిశ్వనాథ ఆలయంKashi Vishwanakh Templeలో డ్రమ్స్ చేతిలో పట్టుకొని మోగించారు. ఆలయంలో భక్తులకు వాయిద్యం చూపిస్తూ మురిసిపోయారు మోదీ. ఈనెల 7వ తేదిన ఉత్తరప్రదేశ్లో ఏడో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే మోదీ యూపీలోని ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. శుక్రవారం కంటోన్మెంట్(Cantonment), వారణాసి నార్త్(Varanasi North)తో పాటు సౌత్(South) లోని మూడు అసెంబ్లీ సెంగ్మెంట్లను రోడ్ షో (Road show)ద్వారా కవర్ చేశారు. ప్రచారం ముగియగానే కాశీలోని కాశీవిశ్వనాథ దేవాలయానికి చేరుకున్నారు. ఆలయంలోని బంగారు పూత పూసిన గర్భగుడి దగ్గర ప్రత్యేక ప్రార్ధనలు చేశారు నరేంద్రమోదీ. అనంతరం ఆలయంలో ఉన్న భక్తుడి చేతిలోని డ్రమ్ (Plays the drums)తీసుకొని కాసేపు వాయించారు. తిరిగి భక్తులకు ఇచ్చేసి వెళ్లిపోయారు. ప్రధాని మోదీ కాశీలోనే కాదు గతంలో కూడా న్యూఢిల్లీలోని గురు రవిదాస్ విశ్రమ్దామ్ టెంపుల్ని సందర్శించిన సమయంలో కూడా అక్కడ పూజలు చేశారు. అనంతరం భక్తులతో కలిసి చేతిలో కంజర వాయించారు. మహిళ భక్తులు గురు రవిదాస్ కీర్తనలు ఆలపిస్తుండగా మోదీ వారితో పాటే నేలపై కూర్చొని కంజెర చేతపట్టుకొని వాయించారు.
విదేశాల్లో కూడా..
మన దేశంలోనే కాదు భారత ప్రధాని గ్లాస్గోలో కాప్-26 సదస్సుకు హాజరై తిరుగు ప్రయాణమైన సమయంలో కూడా అక్కడి భారతీయ స్థానికులు ప్రధాని మోదీకి ఎయిర్పోర్టు వద్ద ఘనంగా వీడ్కోలు పలికారు. స్థానికులు పెద్ద ఎత్తేన డ్రమ్స్ వాయిస్తూ.. పాటలు పాడుతూ వీడ్కోలు పలికారు. ఇది గమనించిన ప్రధాని మోదీ వారివద్దకు వెళ్లి కరచలనాలు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా డ్రమ్స్ వాయిస్తున్నవారి వద్దకు చేరుకొని ఆయన కూడా డ్రమ్స్ వాయించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. మోదీ డ్రమ్స్ వాయించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.
అదే ఉత్సాహం..
2016లో టాంజానియా పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఇదే తరహాలో అక్కడ డ్రమ్స్ వాయించారు భారత ప్రధాని. టాంజానియా ప్రెసిడెంట్ జాన్ పోంబే జోసెఫ్ మాగ్పులితో కలిసి డ్రమ్స్ వాయించారు. ఇండియా, ఆఫ్రికా రిథమ్ వచ్చేలా టాంజానియా ప్రెసిడెంట్, ప్రధాని మోదీ ఇద్దరూ కలిసి లయబద్ధంగా డ్రమ్స్ వాయించారు. అప్పట్లో ఈ వీడియోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్టర్లో షేర్ చేశారు.
#WATCH PM Modi plays the drums along with members of the Indian community gathered to bid him goodbye before his departure for India from Glasgow, Scotland
ప్రధాని మోదీ ఈతరహా సంగీత వాయిద్యాలు, డ్రమ్స్ వాయించడం కొత్తేమి కాకపోయినా ప్రధాని స్థాయి వ్యక్తి ఎంతో సాదా,సీదాగా భక్తితో, అభిమానంతో అలా చేయడం కారణంగా ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.