పరీక్షపై చర్చా.. విద్యార్థులకు మోదీని కలిసే అవకాశం..

గతంలో జరిగిన పరీక్షపై చర్చా కార్యక్రమంలో ఢిల్లీ విద్యార్థులు మాత్రమే పాల్గొన్నారు. ఈసారి అలా కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అవకాశం కల్పించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు.

news18-telugu
Updated: December 5, 2019, 12:36 PM IST
పరీక్షపై చర్చా.. విద్యార్థులకు మోదీని కలిసే అవకాశం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
  • Share this:
పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 'పరీక్షపై చర్చా' కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2018, 2019లో విజయవంతంగా పూర్తయిన ఈ కార్యక్రమం ఇప్పుడు మూడో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 2న పరీక్షా పే చర్చను అధికారికంగా లాంచ్ చేశారు. 'పరీక్షలపై చర్చ.. ప్రధాని మోదీతో..' అనే ట్యాగ్ లైన్‌తో ఈసారి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గతంలో జరిగిన పరీక్షపై చర్చా కార్యక్రమంలో ఢిల్లీ విద్యార్థులు మాత్రమే పాల్గొన్నారు. ఈసారి అలా కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అవకాశం కల్పించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినవారిని ఎంపిక చేసి ప్రధాని మోదీ నిర్వహించే పరీక్షపై చర్చా కార్యక్రమానికి పంపిస్తారు.ఈ క్విజ్ కాంపిటీషన్‌కి సంబంధించిన లింక్‌ను మోదీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 9, 10వ తరగతుల విద్యార్థులు మాత్రమే ఇందులో పాల్గొనాలి.

First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>