ప్రధాని మోదీకి స్వీటు తినిపించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

Political News: మోదీ.. ప్రణబ్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖర్జీయే స్వయంగా తన చేతులతో మోదీకి స్వీటు తినిపించారు. ప్రణబ్‌ ముఖర్జీని కలిసిన అనంతరం మోదీ రెండు ఫోటోలను ట్వీట్‌ చేశారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: May 28, 2019, 2:13 PM IST
ప్రధాని మోదీకి స్వీటు తినిపించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
ప్రధాని మోదీకి స్వీటు తినిపిస్తున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
సాధారణ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి, వరుసగా రెండో సారి ఎన్డీయేకు అధికారాన్ని కట్టబెట్టి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్న ప్రధాని మోదీ ఈ రోజు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. రెండోసారి వరుసగా అఖండ విజయాన్ని సాధించిన తర్వాత ప్రణబ్‌ను మోదీ కలవడం ఇదే మొదటిసారి. త్వరలోనే ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న మోదీ.. ప్రణబ్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖర్జీయే స్వయంగా తన చేతులతో మోదీకి స్వీటు తినిపించారు. ప్రణబ్‌ ముఖర్జీని కలిసిన అనంతరం మోదీ రెండు ఫోటోలను ట్వీట్‌ చేశారు. ఇందులో ఒకటి మోదీకి ప్రణబ్ స్వీటు తినిపిస్తున్న ఫోటో కాగా, మరోటి పుష్పగుచ్ఛం అందచేస్తున్న చిత్రం. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘ప్రణబ్‌కు ఉన్న అపారమైన అనుభవం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రణబ్‌ రాజనీతిజ్ఞుడు. ఆయన దేశానికి ఎంతో సేవ చేశారు. ప్రణబ్‌ ఆశీర్వాదం కోసం ఇవాళ ఆయనను కలిశా’నని మోదీ ట్వీట్‌ చేశారు.

భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో 303 సీట్లను గెలిచిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో కంటే ఈసారి 22 సీట్లను ఎక్కువగా గెలిచింది ఆ పార్టీ. మొత్తం ఎన్డీయేకు 353 సీట్లు వచ్చాయి. ఈ నెల 30వ తేదీన మోదీ రెండో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.


First published: May 28, 2019, 2:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading