Swachh Bharat Mission 2.0: స్వచ్ఛ భారత్ మిషన్ 2.0, అమృత్ 2.0 పథకాలను ప్రారంభించిన మోదీ.. నగరాలను చెత్తరహితంగా మార్చడమే లక్ష్యమన్న ప్రధాని

ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0, అమృత్ 2.0 ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడారు. నగరాలను చెత్త రహితంగా మార్చడమే స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 లక్ష్యమని చెప్పారు. ఈ రెండో దశలో మురికినీటి వ్యవస్థ, సేఫ్టీ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తామన్నారు. నగరాల్లోని నీటి వనరులను సురక్షితంగా మార్చడం, మురుగునీటి నాలలను నదుల్లో విలీనం కాకుండా చూడటంతో లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుందని మోదీ చెప్పారు.

  • Share this:
స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0, అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) 2.0 కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime minister Narendra modi) ప్రారంభించారు. నగరాలను (cities) చెత్త రహితంగా మార్చడంతో పాటు నీటి భద్రత కల్పించాలనే లక్ష్యంతో శుక్రవారం ఈ పథకాలను (Mission) ప్రారంభించారు. ఢిల్లీలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 (Swachh Bharat Mission 2.0), అమృత్ 2.0 ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడారు. నగరాలను చెత్త రహితంగా మార్చడమే స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 లక్ష్యమని చెప్పారు. ఈ రెండో దశలో మురికినీటి వ్యవస్థ, సేఫ్టీ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తామన్నారు. నగరాల్లోని నీటి వనరులను సురక్షితంగా మార్చడం, మురుగునీటి నాలలను నదుల్లో విలీనం కాకుండా చూడటంతో లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుందని మోదీ చెప్పారు.

లక్షలాది మరుగుదొడ్లను నిర్మించడం, వ్యర్థాల ప్రాసెసింగ్‌ను 70 శాతానికి పెంచడం వల్ల స్వచ్ఛ భారత్ మిషన్ (Swachh Bharat Mission ) విజయవంతమైందని చెప్పారు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ. ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమాలు పట్టణీకరణలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడతాయని చెప్పారు. 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి ఈ కార్యక్రమాలు కీలకమని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.

* స్వచ్ఛభారత్‌ 2.0 లక్ష్యాలు..
స్వచ్ఛభారత్‌ 2.0 పథకానికి 9Swachh Bharat Mission 2.0) కేంద్ర ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో మురుగునీటి సమస్యలను దూరం చేయనున్నారు. అమృత్‌ పథకం పరిధిలోకి రాని అన్ని పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీల నిర్వహణపై దృష్టి పెట్టనున్నారు. అన్ని పట్టణ స్థానిక సంస్థలను బహిరంగ మల విసర్జన రహితంగా (ఓడీఎఫ్‌ ప్లస్‌) మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష లోపు జనాభా ఉండే పట్టణాలను ఓడీఎఫ్‌ ప్లస్‌ప్లస్‌గా తీర్చిదిద్దనున్నారు. దీంతోపాటు ఘన వ్యర్థాల నిర్వహణపై సైతం దృష్టి సారిస్తారు. వాటిని తగ్గించడం, పునర్వినియోగించడం, శుద్ధి చేయడంపై దృష్టి సారిస్తారు. మున్సిపాలిటీలలో వెలువడే అన్నిరకాల వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధిచేసి, సమర్థవంతంగా వినియోగిస్తారు.

* అమృత్ 2.0 లక్ష్యాలు
అమృత్‌ 2.0 పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.87 లక్షల కోట్లు కేటాయించింది. కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 4,700 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రతి ఇంటికీ తాగునీటి సదుపాయం కల్పిస్తారు. మొత్తం 2.68 కోట్ల నల్లా కనెక్షన్లు ఇచ్చి లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రణాళిక రచించారు. 500 అమృత్ నగరాల్లో మురుగునీటి నిర్వహణపై దృష్టి పెట్టనున్నారు. మొత్తం 2.64 కోట్ల మురుగు, సెప్టేజ్ కనెక్షన్‌లను అందించనున్నారు. దీనివల్ల మొత్తం 10.5 కోట్ల మందికి పైగా ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.
Published by:Prabhakar Vaddi
First published: