Home /News /politics /

PRIME MINISTER NARENDRA MODI GOING TO CONDUCT MEETING WITH CHIEF MINISTERS AND DISTRICT MAGISTRATES PRV

Pm Narendra Modi meeting: మూడు రోజుల్లో ముఖ్యమంత్రులు, జిల్లా మేజిస్ట్రేట్లతో ప్రధాని మోదీ అత్యవసర సమావేశం.. ఎందుకంటే

ఫ్రధాని నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

ఫ్రధాని నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

కరోనా వ్యాక్సినేషన్‌ (Corona vaccination) పై 11 రాష్ట్రాల ముఖ్యమంత్రుల (Chief ministers)తో కేంద్ర ఆరోగ్య శాఖ (Union health ministry) ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM narendra modi) అధ్యక్షతన నవంబర్​ 3న ఈ సమావేశం జరగనుంది.

ఇంకా చదవండి ...
    కరోనా వ్యాక్సినేషన్‌ (Corona vaccination)పై  11 రాష్ట్రాల ముఖ్యమంత్రుల (Chief ministers)తో కేంద్ర ఆరోగ్య శాఖ (Union health ministry) ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi) అధ్యక్షతన నవంబర్​ 3న ఈ సమావేశం జరగనుంది. ఇటలీ (Italy) నుంచి ప్రధాని రాగానే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah), ఆరోగ్య శాఖ అధికారులు కూడా హాజరవుతారు. కేంద్ర ఆరోగ్య మంత్రులు మన్సుఖ్ మాండవియా, భారతీ పవార్ సమక్షంలో ఈ సమావేశం ఉంటుంది.  ఈ సమావేశంలో 40కి పైగా జిల్లాల మెజిస్ట్రేట్‌లు కూడా పాల్గొంటారు. నవంబర్ నెలాఖరులోపు మొదటి డోస్‌ (first dose) 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి, అలాగే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ (vaccination)ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతపై అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమావేశం నిర్వహించారు. బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి అనేక రాష్ట్రాలు జాతీయ సగటు కంటే ప్రథమ, ద్వితీయ స్థానాల్లో వెనుకబడినట్లు కేంద్రం దృష్టికి వచ్చింది.

    రెండో డోసుకు వెనుకడుగు..

    గడువు ముగిసినా రెండో డోస్ (second dose) వేసుకునేందుకు దాదాపు 11 కోట్ల మంది ముందుకు రావడం లేదని తెలిసింది. మొత్తం మీద 17 రాష్ట్రాల జనాభా ఇందులో ఉంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న యూపీ (Uttar Pradesh)లోని 1.6 కోట్లకు పైగా జనాభా రెండో డోస్‌కు వేసుకోవడం లేదు. వీరిలో 50,000 కంటే ఎక్కువ మంది నాలుగు వారాలు దాటినవారు ఉన్నారు. ఇది డోస్‌ల మధ్య నిర్ణీత విరామం కంటే ఎక్కువ.



    అదేవిధంగా మధ్యప్రదేశ్‌లోని 1.10 కోట్లకు పైగా జనాభా ఇంకా రెండో మోతాదు తీసుకోవలసి ఉంది. బీహార్‌లో ఈ సంఖ్య 72 లక్షలకు పైగా ఉంది. రాజస్థాన్‌ (Rajasthan)లో 86 లక్షలు, మహారాష్ట్రలో 76 లక్షలకు పైగా రెండో డోసు తీసుకోవాల్సి ఉంది. తమిళనాడులో 60 లక్షల మందికి పైగా రెండో డోస్‌కు అర్హత ఉన్నప్పటికీ ఇంకా టీకాలు వేసుకోవడం లేదు.

    . రెండో డోసు ఆవశ్యకతను వివరిస్తూ..

    కర్ణాటకలో 51 లక్షలు మంది రెండో డోస్​ తీసుకోలేదు. గుజరాత్‌లో 42 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో 39.95 లక్షలు, తెలంగాణలో 36.6 లక్షలు, బెంగాల్‌లో 36.16 లక్షలు, జార్ఖండ్‌లో 33.8 లక్షలు, ఒడిశాలో 33 లక్షలు, హర్యానాలో 27 లక్షలు, పంజాబ్‌లో 26.4 లక్షలు, అస్సాం 21 లక్షలకు పైగా జనాభా రెండో డోసే వ్యాక్సిన్​ వేసుకోలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్​ అయింది. రెండో డోసు ఆవశ్యకతను వివరిస్తూ ప్రజలకు వేయాల్సిందిగా.. దానికోసం ప్రణాళికలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Corona Vaccine, Health minister, PM Narendra Modi, Review meeting

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు