Home /News /politics /

PRIME MINISTER NARENDRA MODI A MAN OF IDEAS A MAN OF ACTION TA GH

PM Narendra Modi: నేడు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు.. ఆలోచనలతో పాటు ఆచరణలోనూ తాను ప్రత్యేకమని నిరూపించుకున్న నేత..

ఫ్రధాని నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

ఫ్రధాని నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

75 సంవత్సరాల స్వతంత్య్ర భారతంలో తప్పుడు వాగ్దానాలు, అసమర్థ నాయకత్వంతో ప్రజలను మోసం చేసిన నాయకులకు.. మోదీ వైఖరికి స్పష్టమైన తేడా..

PM Narednra Modi : నరేంద్ర మోదీ జాతీయ రాజకీయాల్లోకి రాకముందు.. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, టీలు అమ్మిన వ్యక్తి దేశానికి ప్రధాని అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే భారత్‌లో ఈ స్థాయికి చేరుకున్న వారిలో ప్రముఖులు, వారి వారసులు, లేదంటే వారు నియమించినవారే ఉన్నారు. కానీ గుజరాత్‌లోని ఒక చిన్న పట్టణంలో టీ కొట్టు నడిపిన ఒక సాధారణ వ్యక్తి.. అఖండ మెజారిటీతో వరుసగా రెండోసారి దేశానికి ప్రధానిగా (Prime Minister )ఎన్నికయ్యారు. అంతేకాక తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ అత్యంత శక్తివంతమైన అధిపతిగా మారారు. "ఒకసారి మనం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం ఎన్నో మైళ్ల దూరం ముందుకు వెళ్లాల్సి రావచ్చు" అని చెప్పినప్పుడు ఆయనలోని దృఢ సంకల్పం, వ్యక్తిత్వాన్ని ప్రజలు నమ్మారు. ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నారు.

75 సంవత్సరాల స్వతంత్య్ర భారతంలో తప్పుడు వాగ్దానాలు, అసమర్థ నాయకత్వంతో ప్రజలను మోసం చేసిన నాయకులకు.. మోదీ వైఖరికి స్పష్టమైన తేడా కనిపిస్తుంది. కొత్త ఆలోచనలను అమలు చేస్తూ, అభివృద్ధికి భరోసా ఇచ్చే ఒక నాయకుడిని దేశం చూసింది. ఇతరుల మాదిరిగా కాకుండా.. ప్రధానిగా తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను విజయవంతంగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. ‘మోదీ ఏదైనా చెప్పారంటే.. దాన్ని కచ్చితంగా చేస్తారు’ అనే నమ్మకం భారత ప్రజలకు కలిగిందంటే.. ఆయన ఎంతటి విజయవంతమైన నాయకుడో తెలుసుకోవచ్చు.

PM Modi: నెమలి టోపీ నుండి రంగురంగుల పగిడి.. ఆకర్షణీయంగా ప్రధాని నరేంద్రమోదీ తలపాగాలు


మహమ్మారి సమయంలో మోదీ పాలన.. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టిందని సర్వేల్లో తేలింది. ప్రపంచంలో శక్తిమంతమైన నేతల్లో ఆయన ఒకరని ప్రఖ్యాత సంస్థలు, మ్యాగజైన్లు తాజాగా కీర్తించాయి. ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 71వ పుట్టినరోజు సందర్భంగా.. భారతీయులు నమ్మే ‘మోదీ మ్యాజిక్’కు సంబంధించిన విశిష్ట అంశాలను విశ్లేషిద్దాం.

PM Modi Birthday: చాయ్ వాలా నుంచి ప్రధాని వరకు.. మోదీ ప్రస్తానం, అరుదైన ఫొటోలు


మహమ్మారి సమయంలో చాలామంది ప్రజలు.. నరేంద్ర మోదీ సమస్యకు పరిష్కారాన్ని కనుగొంటారని బలంగా నమ్మారు. ఈ విశ్వాసానికి కారణం.. ఆయన గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా, గత ఏడేళ్లలో  ప్రధానిగా ఉన్న సమయంలో నెలకొల్పిన ట్రాక్ రికార్డ్. సమస్యాత్మక పరిస్థితులను సమర్థంగా అధిగమించే శక్తి ఆయనకు ఉందనేది ప్రజల దృఢమైన నమ్మకం. ఈ నమ్మకాన్ని మోదీ నిలబెట్టుకున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా ఉన్న భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్థంగా చేపట్టి, ప్రత్యేకత చాటుకున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ఇతర దేశాలకు అందనంత ఎత్తులో భారత్ నిలిచిందంటే కారణం.. మోదీ నాయకత్వ పటిమ, విధానపరమైన నిర్ణయాలే అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఏకంగా 75 కోట్ల వ్యాక్సిన్ డోసులను భారతీయులు పొందడం విశేషం.

Modi Birthday: ప్రధాని మోదీ బర్త్‌డే స్పెషల్.. మునుపెన్నడూ మీరు చూడని ప్రధాని మోదీ అరుదైన ఫొటోలు..


నరేంద్ర మోదీ అనవసరమైన సాంప్రదాయ ప్రోటోకాల్‌కి ప్రాధాన్యం ఇవ్వరు. ప్రజల ఇంటి వద్దకే పాలన అందించాలనేది ఆయన ఉద్దేశం. ఈ లక్ష్యం కోసం వ్యవస్థను బలహీనంగా మార్చిన అడ్డంకులను తొలగించారు. అనవసరమైన చట్టాల రద్దు, ప్రజల బ్యాంకు ఖాతాల్లో నేరుగా సబ్సిడీలు జమ చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో మధ్యవర్తుల తొలగింపు.. వంటి ఉదాహరణలను మనం గమనించవచ్చు. ఆయనను మిగతా నేతలు, పాలకుల నుంచి వేరుచేసే ప్రధాన కారకాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.

1. స్వచ్ఛ భారత్
మోదీకి ముందు.. పరిశుభ్రత అనేది జీవనశైలిలో భాగం అనే ఆలోచనను ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. పరిశుభ్రత, బహిరంగ మల విసర్జన రహిత (ODF) రహిత ప్రాంతాల గురించి మోదీ మొదటిసారి పగ్గాలు చేపట్టినప్పుడే ప్రస్తావించారు. ఈ ప్రచారం ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో చూడవచ్చు. ఇప్పుడు దేశ ప్రజలు పరిశుభ్రతకు అలవాటు పడటంతో పాటు మరింత పరిశుభ్రమైన జీవనశైలిని అలవరచుకున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌ను విజయవంతం చేయడానికి ఎంతగానో కృషి చేశారు మోదీ. పరిశుభ్రత స్థాయిలో నగరాలు, పట్టణాల ర్యాంకింగ్ వ్యవస్థను ప్రారంభించి.. ఈ అంశంలో ఆరోగ్యకరమైన పోటీని నెలకొల్పారు. ఫలితంగా 2014 కి ముందు నాటి పరిస్థితులతో పోలిస్తే.. దేశంలో ఎన్నో స్వచ్ఛ నగరాలు ఉన్నాయి. ప్రధాన పట్టణాలు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

2. మరుగుదొడ్ల కోసం ప్రచారం
దేశంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలనే ఆలోచనను విస్తృతంగా ప్రచారం చేశారు మోదీ. ఇంతకుముందు దేశంలోని 60 శాతం గృహాలకు తరతరాలుగా మరుగుదొడ్లు లేవు. ఇందుకు పేదరికం మాత్రమే అడ్డంకి కాదు. కొంతమందికి ఆర్థిక సామర్థ్యం ఉన్నప్పటికీ మరుగుదొడ్ల వాడకంపై ఉన్న అపోహల కారణంగా వాటిని నిర్మించుకోలేదు. ఇంట్లో మరుగుదొడ్లు లేకపోవడం వల్ల మహిళలు శారీరకంగా, మానసికంగా హింసను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఈ సమస్యపై మోదీ దృష్టి సారించారు. టాయిలెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. వాటిని ఉపయోగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఎంతోమంది ప్రముఖులను ఈ క్రతువులో బాగస్వామ్యం చేశారు. ముఖ్యంగా మహిళలు తమ ఇళ్లలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కుటుంబంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. ఈ ఉపాయం బాగా పని చేసింది. ఫలితంగా స్వచ్చ భారత్ మిషన్ విజయవంతమైంది. నేడు దేశంలో 95 శాతానికి పైగా కుటుంబాలు మరుగుదొడ్లను కలిగి ఉన్నాయి. 2014లో ఇది 40 శాతంగానే ఉండేది.

3. మన్ కీ బాత్
ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వడానికి మోదీ రేడియోలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైందంటే.. గతంలో రేడియోను పాత టెక్నాలజీగా పక్కన పెట్టిన వ్యక్తులు కూడా ఇప్పుడు మన్‌కీబాత్ కోసం వాటిని వినియోగిస్తున్నారు. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మోదీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతమైంది. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కొన్ని నెలలు మినహా గత 7 సంవత్సరాలుగా మన్‌ కీ బాత్ కొనసాగుతోంది. ఇది ప్రజలను మోదీకి మరింత చేరువ చేసింది. కార్యక్రమంలో ప్రధాని ప్రజల నుంచి సలహాలను ఆహ్వానిస్తూ, వారి ఆలోచనలను ప్రజానీకానికి పరిచయం చేస్తుంటారు. ఒక తండ్రి తన పెద్ద కొడుకుతో లేదా యువకుడు తన స్నేహితుడు లేదా అన్నయ్యతో మాట్లాడుతున్నట్లుగా మోదీ మన్‌ కీ బాత్ ఉంటుంది. రాజకీయ పరంగా మైలేజ్ పొందడానికి మోదీ ఈ కార్యక్రమాన్ని ఎన్నడూ ఉపయోగించలేదు. రాజకీయాల కోసం ఆయన ఈ వేదికను ఎప్పుడూ వినియోగించలేదు.

4. విద్యార్థులతో మాటామంతీ
ఇది ప్రధాని మోదీ ప్రత్యేక చొరవ. మరే ఇతర ప్రధాని ఈ ఆలోచన చేయలేదు. ఆయన యువతతో స్నేహం చేశారు. జీవితంలో విజయం సాధించేలా, సవాళ్లను ఎదుర్కొనేలా, ఒత్తిడిని నివారిస్తూ ముందుకెళ్లేలా వారిని ప్రోత్సహించారు. పరీక్షలను సాహసంగా తీసుకోవాలని, పరీక్షలపై ఉండే భయాన్ని మరింత స్నేహపూర్వకంగా ఎదుర్కోవాలని విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడూ పిల్లలతో.. ముఖ్యంగా 10, 11, 12వ తరగతి విద్యార్థులతో ఈ రకమైన సంబంధాన్ని ఏర్పరచుకోలేదు. కానీ ఒక విద్యార్థి జీవితంలో ఈ దశలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని మోదీ గుర్తించారు. భవిష్యత్తులో విజయం సాధించడానికి వారిలో ఒత్తిడిని దూరం చేస్తూ.. ఎలాంటి భయం లేకుండా పరీక్షలను ఎదుర్కోవాలని మోదీ వారికి చెబుతూ.. యువతరానికి దగ్గరయ్యారు.

5. ఫిట్‌నెస్
మోదీకి ముందు రోజువారీ జీవనశైలిలో ఫిట్‌నెస్‌ ప్రాధాన్యం గురించి ఏ నాయకుడూ మాట్లాడలేదు. ఫిట్‌గా, ఆరోగ్యంగా జీవించాలని ప్రజలను ప్రోత్సహించిన మొదటి ప్రధాని ఆయన. మోదీ ఈ అంశంపై యోగా రూపంలో దృష్టి సారించి, ఫిట్‌నెస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు తీసుకొచ్చారు. సెలబ్రిటీలు, నాయకులు, సినీ తారలు, డాక్టర్లు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ యోగాకు ప్రజాదరణ తీసుకొచ్చారు.

6. క్రీడా సంస్కృతి
ఒలింపిక్ క్రీడల వంటి పోటీల్లో భారత అథ్లెట్లు పతకాలు సాధించాలని కొన్నేళ్లుగా చెప్తున్నారు కానీ దానికి తగ్గ ప్రణాళికలు లేవు. ఈ నేపథ్యంలో భారతీయ అథ్లెట్లు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు పొందాలని మోదీ కోరుకున్నారు. దీంతో 2014 నుంచి మోదీ ప్రభుత్వం ఒక మిషన్‌ను రూపొందించింది. దీని ఫలితాలు ప్రస్తుత టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో కనిపిస్తున్నాయి. ఈ ఈవెంట్లలో భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనతో పతకాలు గెల్చుకున్నారు. ఆటగాళ్లకు అత్యుత్త శిక్షణ అందించడం, దేశవాళీ క్రీడా పోటీలు, ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించి ప్రోత్సహించడంతో ఈ విజయాలు సాధ్యమవుతున్నాయి. జావెలిన్ త్రో బంగారు పతక విజేత నీరజ్ చోప్రా అనేక దేశాలలో శిక్షణ పొందారు. మహిళలు, పురుషుల హాకీ జట్లు కూడా కృషి, ప్రణాళికతో గతం కంటే మెరుగ్గా రాణించారు. పోటీల్లో పతకాలు గెలిచిన వారిని మోదీ అభినందించారు. పతకాలు గెలవని వారిని ఓదారుస్తూ ప్రోత్సహించారు.

7. పద్మ అవార్డులు
ఇంతకుముందు పద్మ అవార్డులను పాలక ప్రభుత్వ భావజాలాన్ని విశ్వసించే లేదా అధికార కారిడార్‌లకు దగ్గరగా ఉండే వారికే ప్రదానం చేసేవారు. కానీ ప్రధాని మోదీ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులను నిజమైన భారతీయ అవార్డులుగా మార్చారు. ప్రతిష్టాత్మక పౌరుల గౌరవం కోసం ఉద్దేశించిన ఈ అవార్డులు మునుపటి ప్రభుత్వాల పక్షపాత వైఖరి కారణంగా విశ్వసనీయత కోల్పోయాయి. మోదీ వీటిని మళ్లీ సామాన్యుల పురస్కారాలుగా మార్చారు. పద్మ అవార్డులకు పునర్వైభవాన్ని తిరిగి తీసుకువచ్చారు. అవార్డుల ఎంపిక విధానాన్ని గ్రౌండ్ లెవల్ నుంచి ప్రారంభించి, ప్రజల కోసం పనిచేసిన సామాన్యుల కోసం వెతకడం ప్రారంభించారు. గత 7 సంవత్సరాలుగా పద్మ అవార్డు గ్రహీతల జాబితాను పరిశీలిస్తే.. ఎంపిక ప్రక్రియలో పక్షపాతం, అభిమానం లేదని అర్థమవుతుంది.

8. ఆత్మనిర్భర్ భారత్
ఒక నాయకుడు దేశం పల్స్‌ను అర్థం చేసుకోవడం, దానికోసం ప్రజల్లో విశ్వాసాన్ని నింపడం చాలా ముఖ్యం. మోదీ ఇదే చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలను ఆయన ప్రవేశపెట్టారు. దీర్ఘకాలంలో ఇవి భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా, ఆర్థిక శక్తిగా మారుస్తాయి. ఇలాంటి పథకాల వల్ల మన్మోహన్ సింగ్ పాలనతో పోలిస్తే దేశం రెట్టింపు స్థాయిలో విదేశీ పెట్టుబడులను పొందింది. మన్మోహన్ సింగ్ పదేళ్ల పదవీ కాలంలో, సగటు వార్షిక విదేశీ పెట్టుబడులు సుమారుగా 30 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది ఇప్పుడు మోదీ ఏడేళ్ల కాలంలో 65 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి.

9. సురక్షితమైన, బలమైన భారతదేశం
బాలాకోట్ వైమానిక దాడి తరువాత సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా పాకిస్తాన్‌కు మోదీ తగిన బుద్ధి చెప్పారు. తద్వారా భారతదేశం బలమైన నిర్ణయాలు తీసుకోవాలనే నిర్ణయాన్ని, తీసుకోలదనే హెచ్చరికలను మోదీ నొక్కిచెప్పారు. భారతదేశం చరిత్రలో ఒక ఉగ్ర దాడి తర్వాత ఇంత దూకుడు ప్రదర్శించడం ఇదే మొదటిసారి. విదేశీ గడ్డపై రెండుసార్లు ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లను ధ్వంసం చేయడం ద్వారా మోదీ పాకిస్తాన్‌కు భారతదేశం ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. పాకిస్తాన్ మాత్రమే కాదు, చైనా వంటి శక్తివంతమైన పొరుగుదేశం కూడా ఈ కొత్త భారతదేశం కవ్వింపులకు చలించదు అనే వాస్తవాన్ని అంగీకరించింది. మోదీ 7 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు తగ్గిపోయాయి. దేశం చాలా సురక్షితంగా, భద్రంగా ఉంది.

10. పేదలకు మేలుచేసే ఆలోచనలు
ప్రజల శ్రేయస్సును మెరుగుపరచడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మోదీ విధానం. ఇందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఉజ్జ్వల పేరుతో ఉచిత LPG కనెక్షన్ స్కీమ్ మహిళలకు సాధికారతనిచ్చింది. మోదీ పిలుపు మేరకు కోట్లాది మంది ప్రజలు ఎల్‌పిజి కనెక్షన్‌లపై పొందుతున్న సబ్సిడీలను స్వచ్ఛందంగా అప్పగించారు. బేటీ బచావో- బేటీ పఢావో ప్రచారం ద్వారా బాలికా విద్యకు తోడ్పాటు అందించారు. వారికి గౌరవం, ప్రేమ, విద్య, హక్కులను కల్పిస్తూ.. బాలికలను కుమారులతో సమానంగా చూడాలని ప్రజలకు సూచించారు.

మోదీ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఎక్కువ విలువ ఇస్తారు. అదే సమయంలో సైన్స్, టెక్నాలజీని ప్రోత్సహిస్తారు. జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆధునిక పద్ధతులను అవలంబించాలని చెబుతారు. ఆయన పాలనలో అంతరిక్ష పరిశోధన, క్షిపణి ప్రయోగాలు, సంబంధిత టెక్నాలజీలో కొత్త మైలురాళ్లను భారతదేశం సాధించింది. ఇలా మోదీ హయాంలో అన్ని రంగాల్లో భారత్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ.. ప్రజలకు మరింత చేరువయ్యారు.

భారత రాజకీయాలలో మోదీ అసాధారణమైన నాయకుడు. తన తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో ఆయనకు తెలుసు. పరిస్థితులకు అనుగుణంగా సత్వర నిర్ణయాలు తీసుకోవడం మోదీ ముఖ్య లక్షణం. రాజకీయ లాభాలు, నష్టాలపై ఎప్పుడూ ఆలోచించకుండానే కీలక అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు మోదీ. 71 సంవత్సరాల వయసులో కూడా ఎంతో చురుకుగా ఉండే భారత ప్రధానికి దేశ ప్రజలు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఆయనను కీర్తిస్తున్నారు.
First published:

Tags: National, PM Narendra Modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు