మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తాము తలచుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. అందుకు కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతును సమకూర్చుకుంటామని స్పష్టంచేశారు శివసేన ఎంపీ.

news18-telugu
Updated: November 1, 2019, 5:34 PM IST
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
న్యూస్ 18 క్రియేటివ్
  • Share this:
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వంపై సందిగ్ధం కొనసాగుతోంది. ఫలితాలు వచ్చి వారం రోజులైనా బీజేపీ-శివసేన మధ్య ఒప్పందం కొలిక్కి రాలేదు. 50-50 ఫార్ములా ప్రకారం సీఎం పదవిని చెరి రెండేళ్లు పంచుకోవాల్సిందేనని శివసేన పట్టుబట్టుడుతోంది. కానీ అందుకు బీజేపీ ఒప్పుకోవడం లేదు. అటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో చర్చలు జరపడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ ముంగటివార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబరు 7 లోపు మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరకుంటే రాష్ట్రపతి పాలన వస్తుందని బాంబు పేల్చారు.

మరోవైపు సీఎం సీటు విషయంలో శివసేన వెనక్కి తగ్గడం లేదు. కొత్త ముఖ్యమంత్రి శివసేన పార్టీకి చెందిన నాయకుడే మహారాష్ట్రకు కొత్త సీఎం అవుతారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం ఉదయం ఓ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తాము తలచుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. అందుకు కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతును సమకూర్చుకుంటామని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన,బీజేపీ మధ్య చర్చలు జరగలేదని వెల్లడించారు.

288 అసెంబ్లీ సీట్లు మహారాష్ట్రలో బీజేపీ కూటమి 163 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 103 స్థానాలకే పరిమితమైంది. ఇతరులకు 22 స్థానాలు దక్కాయి. బీజేపీ కూటమిలో బీజేపీకి 105 సీట్లు రాగా..శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది. ఐతే సీట్ల పంపకానికి ముందే 50-50 ఫార్ములాతో ఒప్పందం చేసుకున్నామని.. దాన్ని అమలు చేయాలని పట్టబట్టుతోంది. దీని ప్రకారం చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇలా మిత్రపక్షాలు పోటాపోటీగా సీఎం పీఠంపై కన్నేయడంతో మరాఠా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

First published: November 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>