జమ్మూకాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన, మళ్లీ ట్రిపుల్ తలాక్ బిల్లు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

జమ్మూకాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. జూలై 3 నుంచి ఇది అమల్లోకి రానుంది.

news18-telugu
Updated: June 12, 2019, 9:07 PM IST
జమ్మూకాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన, మళ్లీ ట్రిపుల్ తలాక్ బిల్లు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ (Image:PIB/Twitter)
  • Share this:
జమ్మూకాశ్మీర్‌లో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 3 నుంచి ఇది అమల్లోకి రానుంది. కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు. 2018 డిసెంబర్ 19 నుంచి జమ్మూకాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అంతకు ముందు పీడీపీ - బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. గత ఏడాది జూన్‌‌లో ఆమె రాజీనామా చేశారు. అప్పటి నుంచి డిసెంబర్ వరకు గవర్న్ర పాలన కొనసాగింది. ఆ తర్వాత నుంచి రాష్ట్రపతి పాలన నడుస్తోంది. జమ్మూకాశ్మీర్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆగస్ట్‌లో అమర్‌నాథ్ యాత్ర ముగిసిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

మరోవైపు ట్రిపుల తలాక్ బిల్లును మరోసారి పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేసింది. 16వ లోక్‌సభ‌లో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందినా, రాజ్యసభలో పెండింగ్ ఉండిపోయింది. అయితే, 16వ లోక్‌సభ కాలం ముగిసిపోవడంతో ఇప్పుడు కేంద్రం మరోసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈనెల 17 నుంచి 17వ లోక్‌సభ కాలం ప్రారంభం కానుంది. మొదటి సమావేశాల్లోనే ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...