ఆర్టికల్ 370 రద్దు చేస్తూ... రాష్ట్రపతి గెజిట్ విడుదల

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ... రాష్ట్రపతి గెజిట్ విడుదల

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి గెజిట్ విడుదల

ఇక నుంచి కాశ్మీర్‌లో కూడా కేంద్ర చట్టాలు అమలుకానున్నాయి. భారత రాజ్యాంగం కూడా వర్తిస్తోంది.

  • Share this:
    కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి గెజిట్ విడుదల చేసింది. ఇక నుంచి కాశ్మీర్‌లో కూడా కేంద్ర చట్టాలు అమలుకానున్నాయి. భారత రాజ్యాంగం కూడా వర్తిస్తోంది, జమ్ముకాశ్మీర్‌ను కేంద్రం రెండుగా చీల్చింది. చడ్డ సభలేని కేంద్రంగా లడఖ్ ప్రాంతాన్ని ప్రకటించింది. జమ్ముకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి వద్దన్న ఆర్టికల్ 370 రద్దుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దీనిపై గెజిట్ విడుదల అయ్యింది.

    భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ లను రద్దు చేయడం అంటే కాశ్మీర్ పై దురాక్రమణకు తెగించినట్లేనని ఇప్పటికే జమ్మూకాశ్మీర్ అఖిల పక్ష నేతలు హెచ్చరించారు.ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ లను రద్దు చేస్తే అది జమ్మూ, కాశ్మీర్, లడఖ్ ప్రజలపై రాజ్యాంగ వ్యతిరేకంగా వెళ్లినట్లేనని ప్రకటించారు. ఉద్రిక్తతలను పెంచే దిశగా చర్యలు తీసుకోవద్దని భారత దేశానికి, పాకిస్థాన్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై జమ్ముకాశ్మీర్ నేతలో భేటీ నిర్వహించారు. ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లాతో పాటు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, పీడీపీ, కాంగ్రెస్, సీపీఎం, ఇతర ఎంపీలు పాల్గొన్నారు.
    Published by:Sulthana Begum Shaik
    First published: