Sheila Dikshit | షీలా దీక్షిత్ మృతికి రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖుల సంతాపం

Sheila Dixit | రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖులు షీలా దీక్షిత్ మృతికి సంతాపం తెలిపారు.

news18-telugu
Updated: July 20, 2019, 5:14 PM IST
Sheila Dikshit | షీలా దీక్షిత్ మృతికి రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖుల సంతాపం
యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీతో షీలా దీక్షిత్
  • Share this:
కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ (81) కన్నుమూశారు. దీంతో దేశ ప్రముఖులు సంతాపం తెలిపారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు ఆమె మృతికి సంతాపం తెలిపారు. షీలా దీక్షిత్ మరణం ఎంతో బాధించిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. ఆమె నాయకత్వంలో దేశ రాజధాని ఢిల్లీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.





ఢిల్లీ అభివృద్ధికి షీలా దీక్షిత్ ఎంతో కృషి చేశారని ప్రధాని మోదీ అన్నారు. ఆమె మరణం తనను ఎంతో బాధించిందని చెప్పారు. షీలా దీక్షిత్ కుటుంబానికి సంతాపం తెలిపారు.



షీలా దీక్షిత్ మరణం తనను ఎంతో కుంగదీసిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రియమైన కూతురు షీలా దీక్షిత్. ఆమెతో నాకు ఎంతో వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది.’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.



షీలా దీక్షిత్ మరణం ఢిల్లీకి తీరని లోటు అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. హస్తిన అభివృద్ధిలో ఆమె పాత్ర గుర్తుంచుకోదగినది అని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.



తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు షీలా దీక్షిత్ మృతికి సంతాపం తెలిపారు.

First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు