ప్రధాని మోదీ రాజీనామా.. 30న రెండోసారి ప్రమాణస్వీకారం?

ఈనెల 30వ తేదీన నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత పార్లమెంట్ సమావేశం అవుతుంది.

news18-telugu
Updated: May 24, 2019, 9:12 PM IST
ప్రధాని మోదీ రాజీనామా.. 30న రెండోసారి ప్రమాణస్వీకారం?
రామ్ నాధ్ కోవింద్‌తో ప్రధాని మోదీ (Image:Twitter)
  • Share this:
17వ లోక్‌సభ ఏర్పాటుకు మార్గం సుగమం చేసే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు రాజీనామా చేశారు. ప్రధాని మోదీ తన రాజీనామాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు అందజేశారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ప్రధాని మోదీ కోవింద్‌కు తన రాజీనామాను, మంత్రివర్గం రాజీనామాలను అందజేశారు. రాష్ట్రపతి కోవింద్ ఆ రాజీనామాలను ఆమోదించారు. దీంతో 16వ లోక్‌సభ కాలం ముగిసిపోతుంది. ఈనెల 30వ తేదీన నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత పార్లమెంట్ సమావేశం అవుతుంది. కొత్త ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తారు. అప్పుడు 17వ లోక్‌సభ ప్రారంభం అవుతుంది. ప్రధాని రాజీనామాను రాష్ట్రపతి కోవింద్ ఆమోదించిన తర్వాత మోదీ.. కవితాత్మకంగా ట్వీట్ చేశారు. ‘సూర్యుడు ఈ టెర్మ్‌కి అస్తమిస్తున్నాడు. కానీ, కోట్లాది మంది ప్రజల జీవితాల్లో తెచ్చిన వెలుగులు కొనసాగుతాయి.’ అని ట్వీట్ చేశారు.

First published: May 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు