జగన్‌ను కాపీ కొడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంపై కేజ్రీవాల్ ఫోకస్ చేశారు. విజయం కోసం జగన్మోహన్ రెడ్డి అనుసరించిన ఫార్ములాను ఫాలో కావాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: August 23, 2019, 1:58 PM IST
జగన్‌ను కాపీ కొడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..
అరవింద్ కేజ్రీవాల్,వైఎస్ జగన్ (File Photos)
  • Share this:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల గడువు మాత్రమే ఉండటంతో.. ఇప్పటినుంచే అందుకోసం సన్నద్దమవుతున్నారు ఢిల్లీ సీఎం,ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఇందుకోసం గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఆయా పార్టీలు సాధించిన విజయాల సరళిని ఆయన పరిశీలిస్తున్నారు. విజయం సాధించిన పార్టీలు అనుసరించిన ప్రణాళికలు, వ్యూహాలపై దృష్టిపెట్టారు. క్యాంపెయిన్ స్ట్రాటజీని సిద్దం చేసేందుకు ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంపై కేజ్రీవాల్ ఫోకస్ చేశారు. విజయం కోసం జగన్మోహన్ రెడ్డి అనుసరించిన ఫార్ములాను ఫాలో కావాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ అన్నివర్గాల ఏజ్ గ్రూప్‌లకు ఎలా చేరువయ్యారు..? వైసీపీ పట్ల ప్రజల్లో సానుకూలత పెంచేందుకు ఏయే వ్యూహాలు అనుసరించారు..? వాళ్లందరినీ ఓటు బ్యాంకుగా ఎలా మలుచుకోగలిగారు..? వంటి అంశాలపై కేజ్రీవాల్ నియమించిన ఆమ్ ఆద్మీ పార్టీ టీమ్ రీసెర్చ్ చేస్తోంది. 15నెలల ప్రజాసంకల్ప యాత్రతో పాటు 'రావాలి జగన్.. కావాలి జగన్..' లాంటి నినాదాలు విజయవంతం కావడం వెనుక స్ట్రాటజీని ఆ టీమ్ పరిశీలిస్తోంది.

అయితే కేవలం జగన్ విజయం పైనే కేజ్రీవాల్ ఫోకస్ చేయలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 2014లో మోదీ లోక్‌సభ ఎన్నికల క్యాంపెయిన్, 2015లో నితీష్ కుమార్ ఎన్నికల క్యాంపెయిన్,2017లో పంజాబ్‌లో అమరీందర్ సింగ్ ఎన్నికల క్యాంపెయిన్‌ను కూడా కేజ్రీవాల్ పరిశీలిస్తున్నారని చెబుతున్నారు.అయితే ఇవన్నీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపెయిన్స్‌ కావడం గమనార్హం.ఇదే విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అంకిత్ లాల్ మాట్లాడుతూ.. తాము కేవలం దేశంలో ఆయా పార్టీలు సాధించిన విజయాలను మాత్రమే పరిశీలించడం లేదని, మలేషియా,టర్కిష్,ఇజ్రాయెల్ లాంటి దేశాల్లోని ఎన్నికల సరళిని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. అలాగే కేవలం ప్రశాంత్ కిశోర్ ఆధ్వర్యంలో జరిగిన పొలిటికల్ క్యాంపెయిన్స్ పైనే తాము ఫోకస్ చేయలేదని.. మిగతా పార్టీల గెలుపోటములను కూడా పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా బీజేపీ గాలి గట్టిగా వీస్తున్నవేళ.. ఈసారి ఎన్నికల్లో తిరిగి కుర్చీని కాపాడుకునేందుకు కేజ్రీవాల్ గట్టి వ్యూహాలను రచించే పనిలో పడ్డారు.
First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading