దేశంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా పేరుతెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. గతంలో ఆయన బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు పనిచేశారు. అయితే, అందులో రెండు పార్టీల విజయాలు ప్రశాంత్ కిశోర్ ఖాతాలో ఉన్నాయి. అయితే, తాజాగా మరికొన్ని పార్టీలకు ఆయన పనిచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడానికి పీకే సారధ్యంలోని ఐప్యాక్ సిద్ధమైనట్టు సమాచారం. తమిళనాడులోని మరో కీలక పార్టీతో కూడా పీకే పనిచేయడానికి చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్‌కు మరో రాజకీయ పార్టీ నుంచి డీల్ వచ్చింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐప్యాక్ సేవలు అందించనుంది. ఈ విషయాన్ని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ప్రకటించారు. 2020లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి హస్తినలో గెలవాలని బీజేపీ బలంగా నిర్ణయించుకుంది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ పార్టీ హస్తినలో క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ నుంచి పోటీ చేసిన హేమాహేమీలు కూడా ఓటమిపాలయ్యారు. కిరణ్ బేడీ లాంటి వారిని కూడా ఢిల్లీ ప్రజలు ఓడించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.