వైసీపీకి భారీ విజయం... పీకే టీమ్ నివేదిక

వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఓటింగ్ పూర్తయిన వెంటనే ప్రశాంత్ కిశోర్ టీమ్ ఓ నివేదిక రూపొందించినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: April 13, 2019, 9:08 AM IST
వైసీపీకి భారీ విజయం... పీకే టీమ్ నివేదిక
ప్రశాంత్ కిశోర్, వైఎస్ జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి భారీ విజయం ఖాయమని వైసీపీ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే తమకు ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై పార్టీ వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఓటింగ్ పూర్తయిన వెంటనే ప్రశాంత్ కిశోర్ టీమ్ ఓ నివేదిక రూపొందించినట్టు తెలుస్తోంది. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్... ఆ పార్టీ కోసం ఎప్పటికప్పుడు తన టీమ్ ద్వారా సర్వేలు చేయించి వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తూ వచ్చారు. తాజా ఎన్నికలు పూర్తయిన తరువాత ఓటింగ్ సరళిని బట్టి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై కూడా పీకే టీమ్ ఓ నివేదిక రూపొందించినట్టు సమాచారం.

శుక్రవారం పీకేకు చెందిన ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి... తన గెలుపు కోసం కృషి చేసిన పీకే టీమ్‌కు అభినందనలు తెలిపారు. వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా పీకే టీమ్ జగన్‌కు వైసీపీ గెలుపు ఏ విధంగా ఉండబోతోందనే అంశానికి సంబంధించి నివేదిక కూడా ఇచ్చిందని తెలుస్తోంది. వైసీపీకి 130 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్ సభ స్థానాలు వస్తాయని పీకే టీమ్ ఇచ్చిన నివేదికలో ఉన్నట్టు సమాచారం. అధికార టీడీపీకి 40 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదని పీకే టీమ్ రిపోర్ట్ వెల్లడించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


First published: April 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు