వైసీపీ విజయం... తమిళనాడులో పీకేకు ఫుల్ డిమాండ్... కమల్ హాసన్‌తో భేటీ
తమిళనాడులో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సినీనటుడు కమల్ హాసన్‌ను ప్రశాంత్ కిశోర్ కలవడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
news18-telugu
Updated: June 22, 2019, 2:00 PM IST

ప్రశాంత్ కిశోర్, కమల్ హాసన్
- News18 Telugu
- Last Updated: June 22, 2019, 2:00 PM IST
ఏపీలో వైసీపీ ఘనవిజయం తరువాత ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్‌కు డిమాండ్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ సేవలను బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం వినియోగించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పీకే సారథ్యంలోని ఐ-ప్యాక్ టీమ్‌తో ఆమె ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ప్రశాంత్ కిశోర్ సాయం తీసుకుని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని అక్కడి రాజకీయ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే పీకేతో ఈ మేరకు ఒప్పందం చేసుకోవాలని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇక తాజాగా తమిళనాడులో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సినీనటుడు కమల్ హాసన్‌ను ప్రశాంత్ కిశోర్ కలవడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం చెన్నైలోని కమల్ హాసన్ సారథ్యంలో ఎమ్ఎన్ఎమ్ పార్టీ కార్యాలయానికి వెళ్లిన ప్రశాంత్ కిశోర్... ఆయనతో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్ఎన్ఎమ్ పార్టీ కోసం ప్రశాంత్ కిశోర్ పని చేయడం ఖాయమనే ప్రచారం మొదలైంది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు మాత్రం ఎమ్ఎన్ఎమ్ పార్టీ వర్గాలు నిరాకరించాయి. మొత్తానికి బెంగాల్లో మమత బెనర్జీకి సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న పీకే... తమిళనాడులో ఏ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తారన్న అంశంపై సస్పెన్స్ నెలకొంది.

ఆపరేషన్ తర్వాత ఇంటికి చేరుకున్న లోక నాయకుడు కమల్ హాసన్..
2021 ఎన్నికలపై రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు...
రజినీకాంత్, కమల్ హాసన్ జట్టు.. తమిళనాట మిగిలిన పార్టీల ఆటకట్టు..?
తమిళ రాజకీయాల్లో కీలక మలుపు.. చేతులు కలపనున్న కమల్,రజనీకాంత్
కమల్ హాసన్, బాలకృష్ణ మల్టీస్టారర్ అలా మిస్సైయింది..
కమల్ హాసన్ ఎఫైర్ బట్టబయలు.. ఆ సీనియర్ హీరోయిన్‌తో సహజీవనం..?